
D Spiritual: Dec 13: భారతదేశంలో ఇల్లు నిర్మించేటప్పుడు వాస్తు శాస్త్రాన్ని ముఖ్యంగా పాటిస్తారు. ఇంటి నిర్మాణంలో మాత్రమే కాదు, ఇంట్లో ఉపయోగించే వస్తువులు, వాటి ఏర్పాటు విషయంలో కూడా వాస్తు నియమాలు తప్పనిసరిగా పాటించాలని పెద్దలు చెబుతారు. వాస్తు నియమాలను నిర్లక్ష్యం చేస్తే అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
ఇంట్లో వాస్తు నియమాలు పూర్తిగా పాటించకపోయినా, లేదా చిన్న చిన్న వాస్తు దోషాలు ఏర్పడినా, వాటి ప్రభావం కుటుంబ జీవనంపై పడుతుందని నమ్మకం. ఈ దోషాల కారణంగా ఇంట్లో ఆర్థిక, మానసిక సమస్యలు తలెత్తుతాయని వాస్తు శాస్త్రం వివరిస్తుంది. ఈ నేపథ్యంలో డోర్స్ వెనుక హ్యాంగింగ్స్ ఏర్పాటు చేయడం మంచిదేనా అనే సందేహం చాలామందికి ఉంటుంది.
చాలామంది తమ ఇళ్లలో ప్రధాన ద్వారం లేదా బెడ్రూమ్ డోర్స్ వెనుక హ్యాంగింగ్స్ ఏర్పాటు చేసి, వాటికి బట్టలు, టవల్స్ వంటివి వేలాడదీస్తుంటారు. దీనివల్ల గది మెస్సీగా కనిపించకుండా క్లీన్గా ఉంటుందని భావిస్తారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా చేయడం సరైనది కాదని పండితులు చెబుతున్నారు.
డోర్స్ వెనుక భాగంలో హ్యాంగర్లు ఏర్పాటు చేసి వాటికి వివిధ వస్తువులను తగిలించడం వల్ల ఇంట్లో పురోగతి తగ్గుతుందని వాస్తు నిపుణుల అభిప్రాయం. వాస్తు ప్రకారం ఇంటి ద్వారం లక్ష్మీదేవి ప్రవేశించే స్థలంగా భావిస్తారు. అందుకే ద్వారం చుట్టూ, ముఖ్యంగా డోర్ వెనుక భాగంలో అడ్డంకులు ఏర్పరచడం మంచిది కాదని చెబుతారు.
అలాగే ఖాళీగా ఉంది కదా అని ఇంటి డోర్ల మీద టవల్స్ లేదా బట్టలు ఆరబెట్టడం కూడా వాస్తు ప్రకారం అనుచితమే. ఇలాంటి చిన్న చిన్న తప్పుల వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఉద్రిక్తతలు, కుటుంబంలో గొడవలు ఏర్పడతాయని వాస్తు శాస్త్రం హెచ్చరిస్తుంది.
