D Spiritual: Nov 3: IRCTC Special Package వింటర్ సీజన్ సార్టయ్యింది. కార్తీక మాసం కూడా ప్రారంభమైంది. ఈ టైమ్‌లో శివ కేశవ క్షేత్రాలను సందర్శించేందుకు ఈ టైమ్ పర్ఫెక్ట్. అందుకే ఐఆర్‌సిటిసి ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం…

IRCTC Special Package శీతాకాలంలో ద్వాదశ జ్యోతిర్లింగాలతో పాటు పర్యాటక ప్రదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అది కూడా తక్కువ బడ్జెట్లో ఎక్కువ ప్లేసులు కవర్ చేయాలనుకుంటున్నారా? అయితే ఐఆర్‌సిటిసి మధ్యతరగతి ప్రజల కోసం అద్భుతమైన ప్యాకేజీలను తీసుకొచ్చింది. అది కూడా హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీలను ప్రారంభించింది. ఈ రైళ్లన్నీ హైదరాబాద్ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ప్యాకేజీలో బుక్ చేసుకున్న వారికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించనుంది. ఫ్యామిలీ, కపుల్స్ కోసం ప్రత్యేక ఆఫర్లను సైతం ప్రకటించింది. ఈ సందర్భంగా వింటర్లో ఏయే టూర్లను ప్రకటించింది.. ఇవి ఎప్పటినుంచి ప్రారంభం కానున్నాయి.. ఎక్కడి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ప్యాకేజీ ధరలెంత.. ఎన్నిరోజుల పాటు ప్రయాణం చేయాల్సి ఉంటుందనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం…

ఈ స్పెషల్ ప్యాకేజీ నవంబర్ 27వ తేదీ హైదరాబాద్ నుంచి ప్రారంభం కానుంది.

ఈ ప్యాకేజీ ప్రతి బుధవారం అందుబాటులో ఉంటుంది.

ఈ ప్యాకేజీని ఎంపిక చేసుకున్న వారు ఆరు రోజుల్లో తమ ప్రయాణాన్ని పూర్తి చేసుకోవచ్చు.

ఈ ప్యాకేజీలో భాగంగా మీరు భోపాల్, ఉజ్జయిని, ఓంకారేశ్వర్, ఇండోర్ వంటి ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించొచ్చు.

ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్న వారికి లోకల్ క్యాబ్ సౌకర్యం, భోజన వసతి, వసతి సౌకర్యాలు ఉంటాయి.

అంతేకాదు ఇదే రైలు నుంచి అయోధ్య రామయ్యను, లక్నోను సందర్శించే అవకాశం లభిస్తుంది.

ఈ ప్యాకేజీ కేవలం వచ్చే నెల డిసెంబర్ 3వ తేదీ వరకే. ఆ తర్వాత పొడిగిస్తారా లేదా అనేది చూడాలి.

ఈ ప్యాకేజీ టికెట్ ధర రూ.16,730 నుంచి ప్రారంభమవుతుంది. మీ కన్వినెంట్ బట్టి మీకు కావాల్సిన సీట్లను సెలెక్ట్ చేసుకోవచ్చు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana