ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్‌ కలిసి ఇరాన్‌పై ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పేరుతో సైనిక దాడులను ప్రారంభించాయి. తొలుత ఇది స్వల్పకాలిక సైనిక చర్యగానే భావించినప్పటికీ.. ఇరాన్ ఊహించని స్థాయిలో ప్రతిఘటించడంతో పరిస్థితులు పూర్తిస్థాయి యుద్ధంగా మారాయి.

ఈ ఘర్షణకు ఇప్పటికే ఆరు నెలలు పూర్తయ్యాయి. అయితే యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే దానిపై ఇంకా స్పష్టత లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సైనిక బలగాల మోహరింపును 2027 వరకు కొనసాగించాలని ఆయన నిర్ణయించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తాజాగా వెల్లడించింది.

అయితే ఈ నిర్ణయం అమెరికా రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని ట్రంప్‌ సలహాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు కథనం పేర్కొంది. ముఖ్యంగా నవంబర్‌లో జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికలపై సుదీర్ఘంగా కొనసాగుతున్న ఇరాన్‌ యుద్ధం ప్రభావం చూపవచ్చనే భయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇరాన్–అమెరికా యుద్ధం 2027 వరకు కొనసాగుతుందా?

పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధం ఇప్పట్లో ముగిసే పరిస్థితులు కనిపించడం లేదా? తాజా పరిణామాలను చూస్తే.. అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. అమెరికా పశ్చిమాసియాలో తన సైనిక మోహరింపును 2027 వరకు కొనసాగించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ తాజా నివేదిక వెల్లడించింది.

అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ ఆధ్వర్యంలో తీసుకున్న ఈ నిర్ణయం.. ఇరాన్‌తో కొనసాగుతున్న ఘర్షణలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరిన్ని సైనిక బలగాలు, మెరుగైన వ్యూహాత్మక సామర్థ్యాలు అందుబాటులో ఉండేలా చేయడమే లక్ష్యంగా కనిపిస్తోంది. దీర్ఘకాలిక మిలిటరీ ప్లాన్‌లో భాగంగానే ఈ మోహరింపును పొడిగించినట్లు సమాచారం.

ఇరాన్‌పై ఒత్తిడి పెంచేందుకు ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వం పలు మార్గాలను పరిశీలిస్తోంది. తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు విధించడం, ఇరాన్ దాడులకు ప్రతిదాడులు చేయడం లేదా యుద్ధాన్ని మరింత విస్తరించడం వంటి ప్రత్యామ్నాయాలు అమెరికా ముందున్నాయి.

మొదట కొద్దిరోజుల స్వల్పకాలిక సైనిక చర్యగా భావించిన ఇరాన్‌పై ఆపరేషన్.. కాలక్రమేణా తీవ్రరూపం దాల్చింది. ఇరుదేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు పెరగడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. దీంతో యుద్ధం ఎప్పుడు ముగుస్తుందన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేకుండా పోయింది.

ప్రస్తుతం పశ్చిమాసియాలో అమెరికా భారీ స్థాయిలో సైనిక బలగాలను మోహరించినట్లు సమాచారం. దాదాపు 50,000 మంది అమెరికా సైనికులతో పాటు 19 యుద్ధ నౌకలు, ఫైటర్ స్క్వాడ్రన్లు, వైమానిక రక్షణ వ్యవస్థలు, పారాట్రూపర్ యూనిట్లు

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana