
DSports 10 Dec:ముంబై/అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. ఈ సీజన్‌కు సంబంధించిన మినీ వేలంలో పాల్గొనబోయే ఆటగాళ్ల తుది జాబితాను బీసీసీఐ తాజాగా విడుదల చేసింది. మొత్తం 1,390 మంది ఆటగాళ్లు నమోదు చేసుకోగా, ఫ్రాంచైజీల అభ్యర్థన మేరకు చివరికి 350 మంది ఆటగాళ్లను షార్ట్‌లిస్ట్ చేశారు.
మొత్తం 40 మంది ఆటగాళ్లు తమ కనీస ధరను రూ. 2 కోట్లుగా నమోదు చేసుకున్నారు. వీరిలో ఇద్దరు భారతీయ ఆటగాళ్లు కూడా ఉన్నారు. క్వింటన్ డి కాక్ (దక్షిణాఫ్రికా), కామెరాన్ గ్రీన్ (ఆస్ట్రేలియా), రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్), వనిందు హసరంగా (శ్రీలంక) వంటి కీలక ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు భారీగా దృష్టి సారించాయి. బీసీసీఐ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఇంగ్లాండ్‌కు చెందిన స్టార్ ఆటగాళ్లు బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, జాసన్ రాయ్‌లపై రెండేళ్ల పాటు నిషేధం విధించింది. దీంతో వారు ఈ మినీ వేలంలో పాల్గొనడం లేదు.
జట్ల వద్ద వేలం కోసం మిగిలిన మొత్తంలో అత్యధికంగా కోల్‌కతా నైట్ రైడర్స్ (రూ. 64.3 కోట్లు), చెన్నై సూపర్ కింగ్స్ (రూ. 43.4 కోట్లు), సన్‌రైజర్స్ హైదరాబాద్ (రూ. 25.5 కోట్లు) ముందు స్థానాల్లో ఉన్నాయి.
ఈ మినీ వేలం కేవలం ఒక రోజు మాత్రమే జరగనుంది. ఈ వేలంలో తమకు అవసరమైన ఆటగాళ్లను దక్కించుకోవడానికి ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడనున్నాయి.
