
SDports 22Jan 2026:జకార్తా: ఇండోనేషియాలోని ప్రతిష్టాత్మక ఇస్టోరా సేనయన్ స్టేడియంలో జరుగుతున్న ‘ఇండోనేషియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్ 500’ టోర్నమెంట్లో భారత బ్యాడ్మింటన్ స్టార్లు పీవీ సింధు, లక్ష్య సేన్ అదరగొడుతున్నారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో అద్భుత విజయాలు సాధించి ఇద్దరూ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఇదే క్రమంలో పీవీ సింధు తన కెరీర్లో ఒక అరుదైన మైలురాయిని చేరుకుంది.
- డెన్మార్క్ క్రీడాకారిణి లైన్ హోజ్మార్క్ క్జెర్స్ఫెల్ట్తో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో సింధు 21-19, 21-18 తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో సింధు తన కెరీర్లో 500వ సింగిల్స్ విజయాన్ని నమోదు చేసింది.ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా సింధు రికార్డు సృష్టించింది.ప్రపంచవ్యాప్తంగా మహిళల సింగిల్స్‌లో ఈ మైలురాయిని చేరుకున్న ఆరో క్రీడాకారిణిగా ఆమె నిలిచింది.
- పురుషుల సింగిల్స్‌లో యువ సంచలనం లక్ష్య సేన్ తన జోరును కొనసాగించాడు. హాంగ్‌కాంగ్‌కు చెందిన జేసన్ గుణవాన్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్ష్య సేన్ కేవలం 30 నిమిషాల్లోనే 21-10, 21-11 తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేశాడు. ప్రత్యర్థికి ఎక్కడా అవకాశం ఇవ్వకుండా పవర్ఫుల్ స్మాష్‌లతో లక్ష్య సేన్ మ్యాచ్‌ను ముగించాడు.మరో మ్యాచ్‌లో మాజీ ప్రపంచ నంబర్ వన్ కిదాంబి శ్రీకాంత్ జపాన్ ప్లేయర్ కోకి వటనాబేపై ఉత్కంఠ పోరులో విజయం సాధించి రెండో రౌండ్లోకి ప్రవేశించగా, స్టార్ ప్లేయర్ హెచ్.ఎస్. ప్రణయ్ మలేషియా క్రీడాకారుడు లీ జి జియా చేతిలో ఓడిపోయి టోర్నీ నుండి నిష్క్రమించాడు.
