DSports 6Dec:చెన్నై: ఎఫ్‌ఐహెచ్ పురుషుల జూనియర్ హాకీ ప్రపంచకప్ 2025లో భారత యువ జట్టు అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం (డిసెంబర్ 5) జరిగిన క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో భారత్.. బలమైన బెల్జియం జట్టును పెనాల్టీ షూటౌట్‌లో 4-3 తేడాతో ఓడించి ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసింది.

హోరాహోరీ పోరు
భారత్ వర్సెస్ బెల్జియం. హోరాహోరీగా సాగిన నిర్ణీత 60 నిమిషాల ఆట ముగిసేసరికి ఇరు జట్లు 2-2తో సమంగా నిలిచాయి.విజేతను తేల్చడానికి నిర్వహించిన పెనాల్టీ షూటౌట్‌లో భారత గోల్ కీపర్ ప్రిన్స్‌దీప్ సింగ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ప్రత్యర్థుల రెండు కీలక షాట్లను అడ్డుకుని భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.షూటౌట్‌లో శ్రద్ధానంద్ తివారీ, అంకిత్ పాల్, రోహిత్ గోల్స్ చేశారు.

సెమీస్ సమరం జర్మనీతో
ఈ విజయంతో రెండుసార్లు ప్రపంచకప్ ఛాంపియన్‌గా నిలిచిన భారత్ సెమీఫైనల్‌లో అడుగుపెట్టింది. డిసెంబర్ 7, ఆదివారం జరిగే సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ జట్టు అత్యంత బలమైన జట్టు, డిఫెండింగ్ ఛాంపియన్‌ అయిన జర్మనీతో తలపడనుంది.టోర్నమెంట్ ఆరంభం నుంచీ భారత్.. చిలీ, ఒమన్‌, స్విట్జర్లాండ్‌లపై వరుస విజయాలు సాధించి లీగ్ దశను అజేయంగా ముగించింది. ఇప్పుడు క్వార్టర్స్‌లో బెల్జియంను ఓడించడం ద్వారా టైటిల్ వైపు మరో అడుగు వేసింది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana