D Spiritual: Nov 25: సాధారణంగా ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించడం కోసం ఎన్నో అవస్థలు పడుతుంటారు. కష్టపడి పనిచేయటంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం పొందేందుకు అనేక పూజలు, పరిహారాలు చేస్తుంటారు. వాస్తు ప్రకారం ఇంట్లోని పూజ గదిలో కొన్ని రకాల వస్తువులు ఉంచితే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని నమ్మకం ఉంది. అందువల్ల పూజ గదిలో అవసరమైన ప్రత్యేక వస్తువులను తప్పనిసరిగా ఉంచాలి. ఇంట్లో సిరి సంపదలు నిండాలని కోరుకుంటే పూజ గదిలో ఏ వస్తువులు ఉండాలనే విషయాన్ని చూద్దాం.

పూజ గదిలో ఉంచాల్సిన ముఖ్యమైన వస్తువుల్లో గంట ఒకటి. పూజ సమయంలో గంట మోగించి హారతి ఇస్తారు. గంట ధ్వని పవిత్రతను పెంచుతూ వాతావరణాన్ని శుద్ధి చేస్తుందని భావించబడుతుంది. అందువల్ల ప్రతి ఇంటి పూజ గదిలో గంట తప్పనిసరిగా ఉండాలి.

దీప హారతి కూడా పూజలో ఎంతో ముఖ్యమైన భాగం. దేవుడి ముందు దీపం వెలిగించి హారతి ఇవ్వడం ద్వారా దైవాన్ని జ్యోతి స్వరూపంగా భావించి ఆజ్ఞాపూర్వకంగా పూజించే సూచన ఉంటుంది. దీప జ్యోతి ఇంటిలో సానుకూల శక్తిని పెంచుతుందని చెబుతారు.

పూజాంతరం కర్పూర హారతి ఇవ్వడానికి కూడా ఆధ్యాత్మికమైన అర్థం ఉంది. కర్పూరం వెలిగించి హారతి ఇస్తే మనలోని అహంకారం కర్పూరంలా కరిగిపోవాలని భావిస్తారు. కర్పూర హారతి ద్వారా మనసు మరింత పవిత్రం అవుతుందని శాస్త్రాలు సూచిస్తాయి.

పూజ చేసేటప్పుడు పుష్పాలు సమర్పించడం చాలా సాధారణం. పుష్పాల సుగంధం, పవిత్రత మన హృదయంలోని సుగంధభరితమైన భావాలను దైవానికి సమర్పించడం అనే అర్థాన్ని అందిస్తుంది. అందుకే పుష్పాలు పూజలో తప్పనిసరిగా ఉండాల్సినవి.

ఫలం (మనస్సు) సమర్పించడం అంటే మన కర్మల ఫలితాలపై ఆశ లేకుండా భగవంతునికి అర్పించడం. ఇది నిస్వార్థ భక్తిని సూచించే చర్య.

పత్రం (శరీరం) సమర్పించడం అనేది త్రిగుణాల‌తో కూడుకున్న మన శరీరాన్ని దేవుని సేవలో అర్పించటాన్ని సూచిస్తుంది. ఇది సంపూర్ణ సమర్పణకు సూచిక.

చివరిగా, కొబ్బరికాయ సమర్పణకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అర్థం ఉంది. మన హృదయం అనే కొబ్బరికాయం కోరికలు అనే పీచుతో కప్పబడి ఉంటుంది. కాబట్టి పీచు (కోరికలు) తొలగించి, శుద్ధమైన కొబ్బరిని దేవుడికి సమర్పించడం అంటే కోరికలను విడిచిపెట్టి మన హృదయాన్ని భగవంతునిలో లీనమయ్యేటట్లు చేయడం అనే భావం.

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana
పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana