D Spiritual: Nov 13: దేవుడిని పూజించడం అనేది నిత్యజీవితంలో ఒక ముఖ్యమైన విధి. అయితే, స్వామిని ఆరాధించడంతోపాటు, ఆయా దేవతా స్వరూపాలకు సమర్పించాల్సిన నైవేద్యాలు, పుష్పాలు మరియు ఉపచారాలు విధి ప్రకారం చేస్తే ఆయా దేవతా స్వరూపాలు మరింత తొందరగా అనుగ్రహిస్తారని పండితులు పేర్కొంటున్నారు.

  • లలితాదేవికి: క్షీరాన్నము, మధురఫలాలు, పులిహోర, మిరియాలు కలిపిన పానకము, వడపప్పు, చలిమిడి, పాలు నైవేద్యంగా సమర్పించాలి. ఆరాధనలో కలువపూలు, కదంబ పూల మాల వేయవలెను.
  • లక్ష్మీదేవికి: క్షీరాన్నము, తీపిపండ్లు నైవేద్యంగా సమర్పించి, తామరపూవులతో పూజించాలి.
  • దుర్గాదేవికి: మినపగారెలు, అల్లం ముక్కలు నైవేద్యం పెట్టి, ఎఱ్ఱని పూలమాలతో అలంకరించవచ్చు.
  • వినాయకుడికి: బెల్లం, ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలు నైవేద్యంగా సమర్పించి, శ్వేత (తెల్లని) అక్షతలతో పూజించాలి.
  • శివుడికి: కొబ్బరికాయ, అరటిపండ్లు నైవేద్యంగా సమర్పించి, మారేడు దళములు, నాగమల్లి పువ్వులతో అర్చన చేయాలి.
  • సూర్యుడికి: మొక్కపెసలు, క్షీరాన్నము నైవేద్యంగా సమర్పించాలి.
  • శ్రీ వేంకటేశ్వరస్వామికి: వడపప్పు, పానకము నైవేద్యం పెట్టి, తులసిమాల మెడలో ధరింపవలెను.
  • ఆంజనేయస్వామికి: అప్పములు నైవేద్యంగా సమర్పించి, తమలపాకులతోనూ, గంగసింధూరంతోనూ పూజించాలి. వడమాల, తమలపాకుల మాల వేయవలెను.
  • సత్యనారాయణస్వామికి: ఎర్ర గోధుమనూకతో, జీడిపప్పు, కిస్ మిస్, నెయ్యి కలిపి ప్రసాదము నైవేద్యం పెట్టాలి. స్వామి అలంకార ప్రియుడు కాబట్టి, అన్ని రకాల పూలమాలలు వేయవచ్చు.

ఈ ఉపచారాలను భక్తితో పాటించడం ద్వారా దేవతల అనుగ్రహం త్వరగా లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. దేవాలయాలలో లేదా ఇంట్లో పూజలు చేసేటప్పుడు ఈ విధానాలను పాటించడం శ్రేయస్కరం.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana