
DSports 30 Oct:ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 టోర్నమెంట్‌లో సెమీ ఫైనల్ మ్యాచ్‌లకు వర్షం ముప్పు పొంచి ఉంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌పై వరుణుడి ప్రభావం పడే అవకాశం ఉండటంతో, అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఒకవేళ వర్షం కారణంగా ఈ కీలక మ్యాచ్ రద్దైతే ఏ జట్టు ఫైనల్‌కు చేరుకుంటుందనే ప్రశ్న ఆసక్తికరంగా మారింది.
భారత అభిమానుల్లో ఆందోళన:
లీగ్ దశలో ఆస్ట్రేలియా ఆడిన 7 మ్యాచ్‌లలో 6 గెలిచి, ఒక మ్యాచ్ రద్దు (శ్రీలంకతో) చేసుకుని పాయింట్ల పట్టికలో ఆధిపత్యం చూపింది. భారత జట్టు లీగ్ దశలో ఆడిన ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడం, ఆసీస్ కంటే తక్కువ పాయింట్లతో ఉండటం అభిమానుల్లో ఆందోళన పెంచుతోంది. ప్రపంచ ఛాంపియన్‌గా బలమైన ఆస్ట్రేలియాను ఓడించాలంటే, టీమిండియా మ్యాచ్ పూర్తయ్యేలా చూడాలని కోరుకుంటోంది.
మహిళల ప్రపంచ కప్ 2025లో తొలి సెమీ ఫైనల్ అయిన ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దయితే, అదే విధంగా పాయింట్ల పట్టికలో ముందున్న ఇంగ్లాండ్ జట్టు ఫైనల్‌కు వెళుతుంది.
