D Educt: Sept 29: ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ విడుదల చేసిన 1,156 కానిస్టేబుల్ పోస్టులకు అర్హతలను ప్రకటించింది. 2026 జూలై 1 నాటికి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ప్రత్యేక అర్హతను కల్పించారు. వారు పదో తరగతి ఉత్తీర్ణులై, ఇంటర్మీడియట్ చదివి ఉంటే సరిపోతుందని అధికారులు పేర్కొన్నారు.

సివిల్, ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులకు 18 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు అర్హులు. మిగిలిన కానిస్టేబుల్ పోస్టులకు 18 నుంచి 32 సంవత్సరాల వరకు వయోపరిమితి నిర్ణయించారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితిలో ఐదేళ్ల సడలింపు ఉంటుంది. మాజీ సైనికులు, ప్రభుత్వ ఉద్యోగులు, వితంతువులకు నిబంధనల ప్రకారం అదనపు వయోసడలింపులు వర్తిస్తాయి.