DSports 14Feb 2026:కొలంబో: భారత్-పాక్ హైవోల్టేజ్ మ్యాచ్‌కు కౌంట్‌డౌన్ మొదలైన వేళ, పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ ఆమిర్ టీమిండియా యువ సెన్సేషన్ అభిషేక్ శర్మను లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడికి దిగాడు. అభిషేక్ శర్మకు సరైన బ్యాటింగ్ టెక్నిక్ లేదని, అతడు కేవలం ఒక ‘స్లాగర్’ (బంతిని విచక్షణ రహితంగా బాదేవాడు) మాత్రమేనని ఆమిర్ ఎద్దేవా చేశాడు.

  • పాకిస్థాన్‌లోని ఒక టీవీ చర్చా కార్యక్రమంలో (Haarna Mana Hai) పాల్గొన్న ఆమిర్, అభిషేక్ ఆటతీరుపై తన ‘నిజాయితీ గల అభిప్రాయం’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు: “అభిషేక్ శర్మ ఆడే విధానం చూస్తుంటే నాకు అతడు ఓ స్లాగర్ లాగే అనిపిస్తున్నాడు. అతడికి క్రీజులో నిలకడ లేదు, సరైన బ్యాటింగ్ టెక్నిక్ అసలే లేదు.” “అతడు ప్రతి బంతిని బలంగా కొట్టేందుకు ప్రయత్నిస్తాడు. ఎనిమిది ఇన్నింగ్స్‌లలో ఒకసారి మాత్రమే స్కోరు చేస్తాడు, మిగిలిన సమయాల్లో తక్కువ పరుగులకే (0, 10, 15) ఔట్ అవుతున్నాడు. అందుకే అతడు సక్సెస్ అయ్యేదాని కంటే విఫలమయ్యే అవకాశాలే ఎక్కువ.” “బంతిని బాడీ లైన్ మీద వేసినా లేదా కొంచెం స్లోగా వేసినా అభిషేక్ తడబడతాడు. స్వింగ్ అయ్యే బంతులను ఎదుర్కొని పరుగులు సాధించినప్పుడే అతడిని నేను ఒక నాణ్యమైన బ్యాటర్‌గా గుర్తిస్తాను.”
పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana