
D News: గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తున్నట్లు చెబుతున్న ‘హనుమాన్ అన్ష్’ తెలుగు రిలీజ్‌పై ఇప్పుడు సస్పెన్స్ నెలకొంది. సెప్టెంబర్ 18న తెలుగు రాష్ట్రాల్లో సినిమాను విడుదల చేయాలని భావించినప్పటికీ, చివరి నిమిషంలో కొన్ని అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
త్రివిక్రమ్ తప్పుకున్నారంటూ ప్రచారం
ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెలుగులో ప్రెజెంట్ చేయనున్నట్లు గతంలో ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. డీల్ విషయంలో చివరి నిమిషంలో మార్పులు రావడంతో సెప్టెంబర్ 15న హైదరాబాద్‌లో జరగాల్సిన టీజర్ లాంచ్ ఈవెంట్ కూడా రద్దైనట్లు సమాచారం. దీనిపై చిత్రబృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
సెన్సార్ క్లియరెన్స్ వచ్చిందా?
మరోవైపు తెలుగు వెర్షన్‌కు సెన్సార్ సర్టిఫికేట్ ఇంకా రాలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. సెన్సార్ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో పాటు తెలుగు ట్రైలర్ విడుదల కాకపోవడం, ప్రమోషన్స్ కూడా పెద్దగా జరగకపోవడంతో సెప్టెంబర్ 18 రిలీజ్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కొత్త ప్రెజెంటర్ ఖరారై, సెన్సార్ క్లియరెన్స్ పూర్తయితేనే సినిమా అనుకున్న తేదీకి థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో ‘హనుమాన్ అన్ష్’ తెలుగు రిలీజ్ వాయిదా పడుతుందా? లేక చివరి నిమిషంలో అన్ని సమస్యలు పరిష్కరించి సెప్టెంబర్ 18నే విడుదల చేస్తారా? అనేది ఆసక్తిగా మారింది.
