D Spiritual: Feb 21: గోదావరి పుష్కరాలు – 2027

2027 జూన్ 26వ తేదీ నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభం కానున్నట్లు ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అసెంబ్లీలో ప్రకటించారు. ఎమ్మెల్యే నల్లమిల్లి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. పుష్కరాల నిర్వహణకు విస్తృత స్థాయి ఏర్పాట్లు అవసరమని, ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు.

పుష్కరాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేయనున్న నేపథ్యంలో, నది స్వచ్ఛతను కాపాడటం అత్యంత ప్రాధాన్యమని మంత్రి తెలిపారు. ప్రస్తుతం డ్రెయిన్ల ద్వారా మురుగు నీరు, పరిశ్రమల వ్యర్థాలు నదిలో కలవడం వల్ల కాలుష్యం పెరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రత్యేకంగా రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో గోదావరి పవిత్రతను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. నదిలో జంతు కళేబరాలు, పౌల్ట్రీ వ్యర్థాలు కలిపే ఘటనలు తీవ్రంగా ఉన్నాయని పేర్కొంటూ, ఇలాంటి అక్రమ చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

అదనంగా, పుష్కరాల నిర్వహణలో మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, పారిశుధ్యం, భక్తులకు అవసరమైన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు. గోదావరి నది శుద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కూడా అధికారులకు సూచించారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana