
DSports Jan09 2026:ముంబై: భారత టెస్టు క్రికెట్‌లో మళ్ళీ పాత వైభవాన్ని తీసుకురావడానికి కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నడుం బిగించారు. ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా ఎదుర్కొన్న క్లీన్ స్వీప్ పరాజయాల నుంచి పాఠాలు నేర్చుకున్న గిల్, బీసీసీఐ ముందు ఒక కీలక ప్రతిపాదన ఉంచారు. ఇకపై ప్రతి టెస్టు సిరీస్‌కు ముందు కనీసం 15 రోజుల పాటు ప్రత్యేక శిక్షణా శిబిరం ఉండాలని ఆయన డిమాండ్ చేశారు.
- బిజీ షెడ్యూల్ కారణంగా వన్డేలు, టీ20లు ఆడిన 4-5 రోజులకే టెస్టు మ్యాచ్‌లు ఆడాల్సి వస్తోందని, ఇది ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రభావం చూపుతోందని గిల్ అభిప్రాయపడ్డారు.
- వైట్ బాల్ ఫార్మాట్ నుంచి రెడ్ బాల్ ఫార్మాట్‌కు అలవాటు పడటానికి కనీసం రెండు వారాల సమయం అవసరమని, అందుకే ఈ 15 రోజుల విండో తప్పనిసరి అని పేర్కొన్నారు.
- గిల్ విజన్‌ను మెచ్చుకున్న బీసీసీఐ, ఈ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఒకవేళ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బిజీగా ఉంటే, వీవీఎస్ లక్ష్మణ్ పర్యవేక్షణలో ఈ క్యాంపులు నిర్వహించే అవకాశం ఉంది.
