DSports Dec22 2025: దినేష్ కార్తీక్ ఆశ్చర్యం”గిల్‌ను జట్టు నుంచి తొలగిస్తారని నేను అస్సలు ఊహించలేదు. చాలా కాలంగా అతడిని వైస్ కెప్టెన్‌గా బ్యాక్ చేస్తూ వచ్చి, ఒక్కసారిగా ప్రపంచకప్ జట్టు నుంచి తప్పించడం షాకింగ్‌గా ఉంది. ఇది జట్టులో స్పష్టత లోపించిందని చూపిస్తోంది” అని కార్తీక్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిప్రాయపడ్డారు.

చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గిల్ తొలగింపుపై వివరణ ఇస్తూ.. “గిల్ అద్భుతమైన ఆటగాడు అనడంలో సందేహం లేదు. కానీ ప్రస్తుతానికి జట్టులో సరైన కాంబినేషన్ కోసం చూస్తున్నాం. టాప్ ఆర్డర్‌లో వికెట్ కీపర్ (సంజూ లేదా ఇషాన్) బ్యాటింగ్ చేయాలని భావించడం వల్లే గిల్‌ను పక్కన పెట్టాల్సి వచ్చింది” అని స్పష్టం చేశారు.

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (కీపర్), ఇషాన్ కిషన్ (కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా.