Fuel shortage in AP: Chandrababu should be ashamed-DTv Telangana

DNews: Apr27: పెట్రోల్ లేదు.. డిజిల్ లేదు.. అసలు రాష్ట్రంలో ప్రభుత్వమే లేదు. ప్రజలకు కనీసం ఫ్యుయల్ కొరత లేకుండా చూడలేనోళ్లు.. రాష్ట్రాన్ని ఉద్దరిస్తారట. ఉట్టికి ఎగరలేనమ్మ.. ఆకాశానికి ఎగురుతా అన్నట్లుంది కూటమి ప్రభుత్వ తీరు. దేశంలో ఎక్కడా లేని ఇంధనం కొరత ఏపీలోనే ఏర్పడినందుకు చంద్రబాబు గారు సిగ్గుపడాలి. రాష్ట్ర ప్రజలకు ఇంధన కష్టం కూటమి ప్రభుత్వం విధించిన శాపం. సరిపడా ఇంధనం అందక ప్రజలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ఎర్రటి ఎండలో జనాలను కిలోమీటర్ల మేర నిలబెట్టడం.. పెట్రోల్, డీజిల్ లేదని నో స్టాక్ బోర్డులు తగిలించడం కూటమి పాలనా వైఫల్యానికి నిదర్శనం. 70 శాతం బంకులు బంద్ పెట్టడం అత్యంత దారుణం. మోడీ గారికి మద్దతు ఇచ్చి ప్రధాని పీఠంపై కూర్చోబెట్టిన రాష్ట్రానికి ఈ దుస్థితి పట్టడం బాధాకరం.

సమీక్షలు, సలహాలతో ప్రజల ఇంధన కష్టాలు తీరవు చంద్రబాబు గారు
అమ్మకాలు, ఆందోళనల పేరుతో మసిపూసి మారేడు కాయ చేయాలని చూస్తే కుదరదు. రాష్ట్రంలో ఇంధన సంక్షోభంపై కూటమి ప్రభుత్వం వెంటనే నిద్రమత్తు వీడాలి. ఇంధనం కొరత ప్రభావం ప్రజా జీవనంపై పడకుండా చూడాలి . నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా అప్రమత్తం అవ్వాలి. ఇంధనం కొరతకు లోపం ఎక్కడుందో గుర్తించాలి. డిమాండ్ కి తగ్గ సప్లై ఉండేలా చర్యలు చేపట్టాలి. 24 గంటల డెడ్ లైన్ లా ప్రభుత్వం పని చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అత్యవసర పరిస్థితిగా గుర్తించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అని ‘X’ లో పోస్ట్ చేసారు

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana