D Spiritual: Nov 21: శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఎంతో భక్తిశ్రద్ధలతో పూజించే సంప్రదాయం ఉంది. అమ్మవారికి నైవేద్యాలు సమర్పించేటప్పుడు కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలని పండితులు చెబుతున్నారు. శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడిన రోజు కావడంతో, ఈ రోజు పూజిస్తే అమ్మవారి అనుగ్రహం మరింతగా లభిస్తుందనే విశ్వాసం ఉంది. అయితే ఎంతో మంది వివిధరకాల ప్రసాదాలు సమర్పిస్తుంటారు గానీ, అమ్మవారికి ఏ నైవేద్యాలు అత్యంత ప్రీతికరమో తెలియని వారు కూడా ఉన్నారు.

ప్రతిరోజూ దీపారాధన చేసేవారు సమర్పించాల్సిన నైవేద్యాలు

ఇంట్లో నిత్య దీపారాధన చేసేవారు సాధారణంగా పటిక బెల్లం, అరటి పండ్లు, బెల్లం, కొబ్బరికాయ, ఎండు ద్రాక్ష, పచ్చిపాలు, తేనె, వడపప్పు, పానకం వంటి ప్రసాదాలు సమర్పిస్తే సరిపోతుందని పండితులు సూచిస్తున్నారు. ఇవి ‘అవసర నైవేద్యాలు’గా పరిగణించబడతాయి మరియు వీటికి ఎటువంటి దోషం ఉండదని చెబుతారు.

పర్వదినాల్లో నైవేద్య విధానం

ద్వాదశి, ఎకాదశి, ఇతర పర్వదినాల్లో మడిగా తయారు చేసిన పంచభక్ష్య పరమాన్నాలతో దేవునికి మహా నైవేద్యం పెట్టే సంప్రదాయం ఉంది. దేవునికి పెట్టే ఈ మహా నైవేద్యాన్ని ముందుగా రుచి చూడకూడదు. వంట చేసేటప్పుడు పూర్ణాశ్టకం చదువుకుంటూ శ్రద్ధతో తయారు చేయాలి. నైవేద్యాన్ని రుచి చూడడం, ఎంగిలి చేయడం శాస్త్రోక్తంగా తప్పు.

శుక్రవారం ప్రత్యేక నైవేద్యాల ప్రాముఖ్యత

ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి విశేష నైవేద్యాలు సమర్పించే వారు లలితా సహస్రనామంలో పేర్కొన్న తల్లికి ప్రీతికరమైన నైవేద్యాలు సమర్పిస్తే మరింత శ్రేయస్సు లభిస్తుందని పండితుల అభిప్రాయం.

1. గుడాన్నం – అమ్మవారికి అత్యంత ప్రీతికరం

లలితా అమ్మవారికి గుడాన్నం అత్యంత ఇష్టమైన నైవేద్యం అని చెబుతారు.
‘గుడము’ అంటే బెల్లం, ‘అన్నం’ అంటే బియ్యంతో వండిన వంట — రెండూ కలిసినది గుడాన్నం.
బెల్లానికి నిలువ దోషం లేదని, ఈ నైవేద్యం సమర్పిస్తే దారిద్ర్య వీయం తొలగి ఇంట్లో ధనధాన్యాలు పెరుగుతాయని పండితులు చెబుతున్నారు.

2. పాయసం – క్షీరాన్నం

పాలు, బియ్యం, బెల్లం లేదా పంచదారతో చేసే పాయసం అమ్మవారికి ఎంతో ప్రీతికరం. దీనినే క్షీరాన్నం కూడా అంటారు. పాయసం నైవేద్యం పెట్టడం వల్ల ఇంట్లో సిరిసంపదలు, శ్రేయస్సు పెరుగుతాయని చెబుతారు.

3. పెరుగన్నం – ప్రశాంతతకు సూచకం

పెరుగన్నం కూడా అమ్మవారికి విశేష ప్రీతికరం. పెరుగన్నం నైవేద్యం సమర్పిస్తే ఇంట్లో శాంతి, ఆనందం నెలకొంటాయని పండితులు అంటున్నారు.

4. తేనె గారెలు – గ్రహదోష నివారణ

తేనే గారెలు సమర్పిస్తే అమ్మవారు చాలా సంతోషిస్తారని నమ్మకం. దీని వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయని చెబుతారు.

5. పెసరపప్పు పాయసం

పెసరపప్పుతో చేసిన పాయసం కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. దీన్ని సమర్పించడం వల్ల పనుల్లో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana