D Spiritual: Nov 27: సాధారణంగా మనం పూజ చేసే సమయంలో దేవుడికి పూలు సమర్పించడం సర్వసాధారణం. దేవుడికి పూజ చేయడానికి మార్కెట్‌ నుంచి పూలు కొనుగోలు చేయడం, ఇంటి పెరట్లో ఉన్న గార్డెన్‌ నుంచి పూలు కోసుకోవడం, లేదా పక్కింట్లో ఉన్న పూల మొక్కల నుంచి పూలు తీసుకుని రావడం లాంటివి చేస్తూ ఉంటాము. భక్తిపూర్వకంగా, పవిత్రమైన మనస్సుతో పుష్పం, పండు, జలాన్ని సమర్పిస్తే దేవుడు ఆనందంగా స్వీకరిస్తాడని శాస్త్రాలు చెబుతాయి.

అయితే చాలామంది తెలియకుండా దొంగచాటుగా ఇతరుల మొక్కల నుంచి పూలు కోసుకుని వచ్చి దేవుళ్లను పూజిస్తుంటారు. ఎవరి ఇంట్లో వాళ్లు తమ మొక్కల నుంచి కోసుకుంటే పర్వాలేదు. కానీ పక్కింట్లో ఉన్న పూలు కూడా ఒక్కటి వదలకుండా పూర్తిగా కోసేయడం సరైంది కాదు. ఒకవేళ ఆ ఇంటి యజమానులు వద్దు అని చెప్పినా, వారిని తప్పుపట్టడం, “దైవభక్తి లేదనుకోవడం” తగదు.

నిజానికి మొక్కల యజమానికి కూడా మొత్తం పూలు కోసే హక్కు లేదు. పూజ కోసం మొక్కను ప్రార్థించి కొద్దిపాటి పూలను మాత్రమే కోసుకోవాలి. మొత్తం పూలు కోసేసి బోసిపోయినట్టుగా మొక్కను మార్చడం శాస్త్రం ప్రకారం పాపంగా పరిగణించబడింది. ముఖ్యంగా యజమాని అనుమతి లేకుండా పూలు కోసుకోవడం దొంగతనంగా పరిగణించబడుతుంది.

పూలు కోయాలంటే ముందుగా ఇంటి యజమానిని అడగాలి. అలా అనుమతి తీసుకుని కోసుకుంటే, మీరు చేసే పుణ్యంలో సగం భాగం వారికి కూడా చేరుతుందని గరుడపురాణం చెబుతోంది. అలాగే తాంబూలం, పండ్లు, పూలు దొంగతనం చేసే వారు అడవుల్లో కోతిలా పుడతారని, చెప్పులు, గడ్డి, ప్రత్తి దొంగతనం చేసే వారు మేకలుగా జన్మిస్తారని గ్రంథాల్లో ఉంది.

పూజలు చేస్తే పుణ్యం కలగాలి, మోక్షం దొరకాలి, మంచి జన్మ లభించాలి. కానీ యజమాని అనుమతి లేకుండా ఇతరుల మొక్కల నుంచి పూలు కోసుకుని చేసే పూజలు పుణ్యం ఇవ్వవు. పైగా పాపాన్ని తెస్తాయి. పూలు కోసుకోవడం తప్పు కాదు, కానీ అనుమతి లేకుండా కోసుకోవడం తప్పు. ఇక కొన్ని మంది ఒక్క పువ్వు కూడా అక్కడే ఉంచకుండా చెట్టులో ఉన్న అన్నీ పూలను కోసేస్తారు. ఇది మరింత పెద్ద పాపంగా పరిగణించబడుతుంది.

మానవ జన్మ ఎంతో అరుదైనది. ఒకసారి అది తప్పిపోతే తిరిగి మనిషిగా పుట్టడానికి వేల జన్మలు పడుతాయని శాస్త్రాలు చెప్పాయి. అందుకే ఇతరుల మొక్కల నుంచి పూలు కోసుకునే సందర్భంలో జాగ్రత్తగా, నియమపూర్వకంగా, అనుమతి తీసుకుని మాత్రమే చేయడం శ్రేయస్కరం.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana