ఫోన్‌పే, గూగుల్‌పే వంటి డిజిటల్‌ పేమెంట్ల సమయంలో కేవలం స్క్రీన్‌షాట్‌ లేదా ‘పేమెంట్‌ సక్సెస్‌’ మెసేజ్‌ను చూసి నమ్మవద్దని పోలీసులు సూచించారు. నగదు నిజంగా ఖాతాలో జమ అయిందో లేదో బ్యాంక్‌ యాప్‌, ఖాతా బ్యాలెన్స్‌ లేదా ఇతర అధికారిక మార్గాల ద్వారా నిర్ధారించుకున్న తర్వాతే వస్తువులు ఇవ్వాలని సూచించారు.

Fake PhonePe Payment: నకిలీ ఫోన్‌పే, గూగుల్‌పేతో మోసాలు.. అంబర్‌పేటలో నలుగురు అరెస్ట్

హైదరాబాద్‌ అంబర్‌పేటలో ఏటీఎంల వద్ద అమాయకులను లక్ష్యంగా చేసుకుని నకిలీ ఫోన్‌పే, గూగుల్‌పే యాప్‌లతో మోసాలకు పాల్పడుతున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ముగ్గురు యువకులు కాగా.. మరో వ్యక్తి బాల నేరస్థుడిగా పోలీసులు గుర్తించారు.

నిందితుల నుంచి రెండు బైకులు, నాలుగు మొబైల్‌ ఫోన్లు, రూ.12,500 నగదును స్వాధీనం చేసుకున్నట్లు అంబర్‌పేట ఇన్‌స్పెక్టర్‌ కిరణ్‌ కుమార్‌ తెలిపారు.

అంబర్‌పేట శివంరోడ్డులోని ఎస్‌బీఐ ఏటీఎం వద్ద నగదు తీసుకునేందుకు లేదా డిపాజిట్‌ చేసేందుకు వచ్చే వారిని నిందితులు లక్ష్యంగా చేసుకునేవారని పోలీసులు తెలిపారు. వారితో మాటలు కలిపి.. ఫోన్‌పే లేదా గూగుల్‌పే ద్వారా డబ్బులు పంపిస్తామని నమ్మించేవారు. బాధితుల నుంచి నగదు తీసుకున్న అనంతరం.. నకిలీ యాప్‌ ద్వారా రూపొందించిన ‘ట్రాన్సాక్షన్‌ సక్సెస్‌’ స్క్రీన్‌ను చూపించి అక్కడి నుంచి పరారయ్యేవారని పోలీసులు వెల్లడించారు.

ఈ తరహా మోసాలపై గత నెలలో అంబర్‌పేట పోలీసులకు నాలుగు ఫిర్యాదులు అందినట్లు ఇన్‌స్పెక్టర్‌ కిరణ్‌ కుమార్‌ తెలిపారు. అంబర్‌పేట ఎస్‌బీఐ పర్సనల్‌ బ్యాంకింగ్‌ బ్రాంచ్‌ చీఫ్‌ మేనేజర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో నిందితులను గుర్తించిన పోలీసులు.. వారిని అరెస్ట్ చేశారు.

అరెస్టైన నిందితుల నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు మొబైల్‌ ఫోన్లు, రూ.12,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మోసాల్లో నిందితుల పాత్ర, మరిన్ని ఘటనలకు సంబంధించి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా చెల్లింపుల సమయంలో కేవలం స్క్రీన్‌షాట్‌ లేదా ‘పేమెంట్‌ సక్సెస్‌’ మెసేజ్‌ను చూసి నమ్మవద్దని పోలీసులు సూచించారు. డబ్బు నిజంగా ఖాతాలో జమ అయ్యిందో లేదో బ్యాంక్‌ యాప్‌, ఖాతా బ్యాలెన్స్‌ లేదా ఇతర అధికారిక మార్గాల ద్వారా స్వయంగా నిర్ధారించుకున్న తర్వాతే నగదు లేదా వస్తువులు ఇవ్వాలని ప్రజలకు సూచించారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana