
DSports 04Feb 2026: ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీలో భారత్ మరియు శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ టోర్నీలో పాల్గొంటున్న 20 జట్లలో దాదాపు అన్ని దేశాల జట్లలోనూ భారత సంతతి ఆటగాళ్లు మెరుస్తున్నారు. ముఖ్యంగా అసోసియేట్ దేశాలు మినీ టీమిండియాలా కనిపిస్తున్నాయి.
- కెనడా: ఏకంగా 11 మంది భారత సంతతి ఆటగాళ్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. జట్టు కెప్టెన్‌గా గురుదాస్‌పూర్‌కు చెందిన దిల్‌ప్రీత్ బజ్వా వ్యవహరిస్తున్నారు.
- అమెరికా (USA): 9 మంది భారతీయ మూలాలున్న ప్లేయర్లు ఉన్నారు. ఆనంద్‌కు చెందిన మోనాంక్ పటేల్ ఈ జట్టుకు నాయకత్వం వహిస్తుండగా, ముంబైకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సౌరభ్ నేత్రావల్కర్ స్టార్ బౌలర్‌గా కొనసాగుతున్నారు.
- ఒమన్ & యూఏఈ: ఈ రెండు జట్లలో చెరో 7 గురు భారత సంతతి ప్లేయర్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లూధియానాకు చెందిన జతీందర్ సింగ్ ఒమన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు.
- ఇతర జట్లు: నెదర్లాండ్స్‌లో ఆర్యన్ దత్, న్యూజిలాండ్‌లో రచిన్ రవీంద్ర, ఈష్ సోధి, సౌతాఫ్రికాలో కేశవ్ మహారాజ్, ఇటలీలో జస్‌ప్రీత్ సింగ్ వంటి వారు తమ సత్తా చాటనున్నారు.
