
D Educt: Sept 7: ప్రపంచస్థాయి పెట్టుబడులను రాష్ట్రానికి ఆకర్షించడంతో పాటు కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం కల్పించి తెలంగాణ యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన సంకల్పమని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం డిసెంబరు 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2026’ ఏర్పాట్లపై మంత్రి సమీక్ష నిర్వహించారు. పరిశ్రమల శాఖ డైరెక్టర్ కార్యాలయంలో ఈ నెల 5న జరిగిన సమావేశంలో సదస్సు ఏర్పాట్లు, రోడ్‌షోలు, వివిధ సంస్థలతో కుదుర్చుకోనున్న అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.
గ్లోబల్ సమిట్ ద్వారా తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు.. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు, వ్యాపార అవకాశాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
సదస్సు విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలు, రోడ్‌షోల నిర్వహణ, పెట్టుబడిదారులతో చర్చలు, ఎంవోయూలకు సంబంధించిన ఏర్పాట్లను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని మంత్రి సూచించారు.
