
D Educt: Sept 22: ఎప్‌సెట్ బైపీసీ విద్యార్థులకు తొలి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ సెప్టెంబరు 21న పూర్తైంది. కన్వీనర్ కోటాలో మొత్తం 10,612 సీట్లు అందుబాటులో ఉండగా, వాటిలో 10,061 సీట్లు భర్తీ అయ్యాయి. మరో 551 సీట్లు మిగిలినట్లు ప్రవేశాల కన్వీనర్ శ్రీదేవసేన తెలిపారు.
బయోమెడికల్, బయోటెక్నాలజీ కోర్సుల్లో అందుబాటులో ఉన్న అన్ని సీట్లు పూర్తిగా భర్తీ అయ్యాయని ఆమె వెల్లడించారు. బీఫార్మసీ కోర్సులో 94 శాతం, ఫార్మాడీలో 99 శాతం సీట్లు నిండినట్లు తెలిపారు. మొత్తంగా కన్వీనర్ కోటాలో 95 శాతం సీట్లు భర్తీ అయినట్లు పేర్కొన్నారు.
తొలి విడతలో సీట్లు పొందిన విద్యార్థులు నిర్ణీత ఫీజును చెల్లించి, సెప్టెంబరు 24లోపు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని శ్రీదేవసేన సూచించారు. గడువులోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని విద్యార్థులకు కేటాయించిన సీట్లు రద్దయ్యే అవకాశం ఉందని ఆమె స్పష్టం చేశారు.
