
D News: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో తన మార్కెట్‌ను మరింత పెంచుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ‘మహానటి’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దుల్కర్.. ‘సీతారామం’తో భారీ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ‘లక్కీ భాస్కర్’తో మరో సక్సెస్ అందుకుని టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు.
కొంతకాలంగా తమిళ, మలయాళ సినిమాలపై ఫోకస్ పెట్టిన దుల్కర్.. ఇప్పుడు మళ్లీ తెలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు తెలుగు ప్రాజెక్టులు ఉన్నాయి.
అందులో ఒకటి ‘ఆకాశంలో ఒక తార’. పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దుల్కర్ సరసన సాత్విక వీరవల్లి నటిస్తున్నారు. శ్రుతి హాసన్ కీలక పాత్రలో కనిపించనుంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్, లైట్ బాక్స్ మీడియా నిర్మిస్తున్నాయి.
మరోవైపు ‘శ్రీ శ్రీ’ అనే తెలుగు ప్రాజెక్ట్‌లోనూ దుల్కర్ నటిస్తున్నాడు. దీంతో వరుసగా రెండు తెలుగు సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనున్నాడు.
ఇప్పటికే ‘సీతారామం’, ‘లక్కీ భాస్కర్’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దుల్కర్.. ఈ రెండు సినిమాలతో తన సక్సెస్ ట్రాక్‌ను కొనసాగిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.
