
D Educt: Sept 18: రాష్ట్రంలోని ప్రైవేటు, అన్‌ఎయిడెడ్, నాన్‌మైనారిటీ హోమియోపతి కళాశాలల్లో బీహెచ్‌ఎంఎస్ (BHMS) కోర్సులో ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 23 రాత్రి 9 గంటల్లోగా దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకుని, సంబంధిత ధ్రువపత్రాలతో పాటు అప్‌లోడ్ చేయాలని విజయవాడ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ సాయి సుధీర్ తెలిపారు.
సెప్టెంబర్ 18 రాత్రి 8 గంటల నుంచి సెప్టెంబర్ 20 రాత్రి 10 గంటల వరకు సర్వర్ మెయింటెనెన్స్ కారణంగా దరఖాస్తుల ప్రక్రియ అందుబాటులో ఉండదని రిజిస్ట్రార్ వెల్లడించారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించి గడువులోగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.
విజయనగరంలోని మహారాజా హోమియోపతి కళాశాల, పుత్తూరులోని కేకేసీ హోమియోపతి కళాశాల, తాడేపల్లిగూడెంలోని ఎ.ఎస్.ఆర్. హోమియోపతి కళాశాల, గుంతకల్లులోని ఆది శివ సద్గురు ఆలీ సాహెబ్ శివార్యుల హోమియోపతి కళాశాలలో ఒక్కో కళాశాలలో 42 బీహెచ్‌ఎంఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ఈ నాలుగు కళాశాలల్లో ఆలిండియా కోటా కింద ఒక్కో కళాశాలలో 15 సీట్ల చొప్పున భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. నీట్ యూజీ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు కౌన్సెలింగ్ ద్వారా ఈ సీట్లను భర్తీ చేయనున్నారు.
ప్రవేశాలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే 89787-80501, 79977-10168 నంబర్లను సంప్రదించాలని రిజిస్ట్రార్ సూచించారు. దరఖాస్తు ప్రక్రియలో సాంకేతిక సమస్యలు ఎదురైతే 90007-80707 నంబర్‌లో సంప్రదించవచ్చని తెలిపారు.
