D Spiritual: Dec 8: కలలో ఎగురుతున్న పక్షుల గుంపు కనిపించడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ కల మంచిదా చెడ్డదా అనేది పక్షులను మీరు ఏ పరిస్థితేలో చూసారన్న దానిపై ఆధారపడి ఉంటుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం రామచిలుకను బుధ గ్రహానికి ప్రతీకగా పరిగణిస్తారు. అందువల్ల రామచిలుక కలలో కనిపించడం గందరగోళ పరిస్థితులను సూచిస్తుందని నమ్మకం. అదే పక్షులు పదేపదే కనిపిస్తే, మీరు ఒకే విషయం గురించి నిరంతరం ఆలోచిస్తున్నారని అర్థం.

మనుషులకు రకరకాల కలలు వస్తాయి—కొన్నిసార్లు భయంకరంగా, కొన్నిసార్లు హాస్యాస్పదంగా, మరికొన్నిసార్లు విచిత్రంగా. స్వప్నశాస్త్రం ప్రకారం ప్రతి కలలో ఒక అర్థం దాగి ఉంటుంది. చాలా సందర్భాలలో ఆ కలలు భవిష్యత్తుకు సంబంధించిన సంకేతాలను సూచిస్తాయి. కొన్ని కలలు ముందు జాగ్రత్తను హెచ్చరిస్తే, మరికొన్ని శుభవార్తలు రాబోతున్నాయని తెలియజేస్తాయి. కలలో పక్షుల గుంపు ఎగురుతూ కనిపించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. వాస్తు, జ్యోతిషశాస్త్రాల ప్రకారం ఇది ఆకస్మిక సంపద లభించబోతుందనే సంకేతంగా భావిస్తారు.

అయితే ప్రతి పక్షి కల శుభమే అని కాదు. పక్షి కనిపించిన పరిస్థితి, దాని ప్రవర్తన ఆధారంగా కల అర్థం మారుతుంది. రామచిలుక బుధగ్రహానికి సూచిక కావడంతో, ప్రతిసారీ శాంతి కంటే గందరగోళాన్నే సూచిస్తుందని చెబుతారు. పక్షులు పదేపదే కనిపిస్తే, మనసు ఒక విషయంపై ఎక్కువగా మగ్గిపోవడం వల్ల గందరగోళ పరిస్థితులు తలెత్తవచ్చనే సంకేతం.

కలలో పక్షి కనిపించడం తెలివితేటలు బయటపడతాయని, మరియు తెలియకుండానే మీరు ఒక ప్రమాదం వైపు సాగుతున్నారనే హెచ్చరిక కూడా కావొచ్చు. అతిగా ఆలోచించడం వల్ల సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందనే సూచన కూడా ఇదే. ఎవరికైనా కలలో రామచిలుక జతగా కనిపిస్తే ప్రేమలో విజయం సాధించే అవకాశం ఉందని, వైవాహిక జీవితంలో అదృష్టం కలగబోతుందని భావిస్తారు.

పంజరంలో ఉన్న పక్షిని కలలో చూడటం పెద్ద మొత్తంలో సంపద రావచ్చుననే సంకేతంగా చెబుతారు. భుజంపై కూర్చున్న పక్షి అయితే వ్యాపారంలో లాభాలు సాధించబోతున్నారన్న అర్థం. అయితే పక్షులు కలలో పదేపదే కనిపిస్తూనే ఉంటే, ఏదో విధంగా మోసానికి గురికావచ్చుననే చెడు సంకేతమని స్వప్నశాస్త్రం హెచ్చరిస్తుంది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana