తెలంగాణలోని ప్రైవేట్ స్కూల్ పేర్లలో మోడల్, ఇంటర్నేషనల్, టెక్నో, ఒలింపియాడ్, టాలెంట్ వంటి పదాలను వాడకూడదని రాష్ట్ర ప్రభుత్వం 2009లోనే జీవో-91 ద్వారా నిషేధించినప్పటికీ, ఇప్పటికీ చాలా ప్రైవేటు పాఠశాలలు ఈ నిబంధనను ఉల్లంఘిస్తున్నట్లు తేలింది. విద్యావేత్తలు ఇటువంటి పేర్లను మార్కెటింగ్ వ్యూహాలుగా చెబుతుండగా.. ప్రభుత్వ ఉత్తర్వుల అమలులో లోపాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు పేరు కంటే విద్యా నాణ్యతను ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు.

మీరుండే ఏరియాలోనో, ఊర్లోనో ఉండే ప్రైవేటు స్కూల్స్ పేర్లను ఎప్పుడైనా గమనించారా..? కచ్చితంగా ప్రైవేట్ స్కూల్ పేర్లలో ఇంటర్నేషనల్, టెక్నో, ఒలింపియాడ్, టాలెంట్ వంటి పదాలు కనిపిస్తాయి. అయితే అటువంటి పదాలను స్కూల్ నేమ్ బోర్డులో వాడొద్దనే రూల్ ఉందనే విషయం తెలుసా..? అటువంటి పేర్లు ఉపయోగించరాదని రాష్ట్ర ప్రభుత్వం 2009లో జారీ చేసిన జీవో నెం.91 స్పష్టంగా పేర్కొన్నప్పటికీ.. చాలా జిల్లాల్లో ఇప్పటికీ వందలాది పాఠశాలలు ఈ నిబంధనను ఉల్లంఘిస్తున్నట్లు తేలింది. ప్రభుత్వం నిషేధించిన ఈ పేర్లను కొనసాగిస్తూ కొన్ని విద్యాసంస్థలు తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పాఠశాల విద్యాశాఖ అధికారిక డేటాబేస్ ఆధారంగా నిర్వహించిన విశ్లేషణ ప్రకారం.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని మొత్తం 3,697 పాఠశాలల్లో కనీసం 601 స్కూల్స్ అంటే దాదాపు 16.3 శాతం విద్యాసంస్థలు, నిషేధిత పదాల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదాలను తమ పేర్లలో కొనసాగిస్తున్నాయని తేలింది. వీటిలో అత్యధికంగా మోడల్ అనే పదం 210 పాఠశాలల పేర్లలో ఉండగా.. టాలెంట్ 73, ఇంటర్నేషనల్ 72 పాఠశాలల పేర్లలో కనిపించింది. అదనంగా కాన్సెప్ట్, ఎక్సలెన్స్, బ్రిలియంట్, క్రియేటివ్ వంటి పదాలు కూడా విస్తృతంగా వినియోగంలో ఉన్నట్లు గుర్తించారు.

By Ramya

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana