
DNews: Jan5: తెలంగాణ రాష్ట్ర జనసేన కమిటీల రద్దు, వాటి స్థానంలో అడ్ హాక్ కమిటీల నియామకం
- తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా, పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు కమిటీల్లో మార్పులు చేయాలని నిర్ణయం
- GHMC, వీరమహిళ, యువజన, విద్యార్థి విభాగ కమిటీలను రద్దు చేసి, వాటి స్థానంలో కొంతమంది సభ్యులతో తాత్కాలికంగా అడ్ హాక్ కమిటీలను నియామకం
- 30 రోజుల పాటు పనిచేయనున్న అడ్ హాక్ కమిటీ
- ప్రతి నియోజకవర్గం, GHMC 300 వార్డుల్లో పర్యటించి నుంచి కనీసం ఐదుగురు సభ్యులతో జాబితాను సిద్ధం చేసి పార్టీ కార్యాలయం దృష్టికి తీసుకురానున్న ఈ అడ్ హాక్ కమిటీ సభ్యులు
- త్వరలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే చేసేలా నూతన కమిటీల ప్రకటన
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్న పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి గారు.
