
D Spiritual: Nov 8: సాధారణంగా వివాహం తర్వాత ప్రతి ఆడపిల్ల తన పుట్టింటిని వదిలి అత్తవారింటికి వెళ్లాల్సి వస్తుంది. ఈ సందర్భంలో పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళ్తూ కొన్ని వస్తువులను తీసుకెళ్లడం సహజమే. పుట్టింటిలో నచ్చిన వస్తువులను కూతురు అత్తవారింటికి తీసుకెళ్లడం మనం తరచూ చూస్తుంటాం. అయితే ఏ వస్తువులనైనా ఇష్టానుసారం తీసుకెళ్లడం మంచిదికాదని పండితులు చెబుతున్నారు. కొన్ని వస్తువులను తీసుకెళ్లడం వల్ల కుటుంబాలలో మనస్పర్థలు, ఆర్థిక ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
మొదటగా, పూజాసామాగ్రి వంటి పవిత్రమైన వస్తువులను పుట్టింటి నుంచి అత్తవారింటికి తీసుకెళ్లకూడదు. దీపం, పూజా పాత్రలు, బిళ్లలు, గంటలు వంటివి పుట్టింటికే పరిమితం చేయాలి. ఇలా పూజాసామాగ్రిని అత్తవారింటికి తీసుకెళ్లడం వలన రెండు కుటుంబాల మధ్య అపార్థాలు లేదా మనస్పర్థలు రావచ్చని విశ్వసిస్తారు.
అదేవిధంగా పులుపు, చేదు రుచుల వస్తువులను కూడా పుట్టింటి నుంచి అత్తవారింటికి తీసుకెళ్లరాదు. పులుపు వస్తువులు (చింతపండు, నిమ్మకాయ మొదలైనవి) తీసుకెళ్తే కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు, విభేదాలు ఏర్పడతాయని నమ్మకం ఉంది. చేదు వస్తువులు (కాకర, నీలవేము మొదలైనవి) తీసుకెళ్లడం వలన అభిప్రాయ భేదాలు, మాటల తగాదాలు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
లక్ష్మీ స్వరూపంగా భావించే వస్తువులు — ఉప్పు, చింతపండు, చీపుర్ వంటి వాటిని కూడా పుట్టింటి నుంచి అత్తవారింటికి తీసుకెళ్లకూడదు. ఇవి పుట్టింటి ఐశ్వర్యాన్ని సూచిస్తాయి. ఈ వస్తువులను తీసుకెళ్లడం అనేది పుట్టింటి లక్ష్మీదేవిని అత్తవారింటికి తీసుకెళ్లినట్లే అవుతుంది. దాంతో పుట్టింటిలో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయని విశ్వసిస్తారు.
ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ వస్తువులను తీసుకెళ్లాల్సి వస్తే, కొద్దిపాటి డబ్బు పుట్టింటి వారికి చెల్లించి తీసుకెళ్లడం మంచిదని పండితులు సూచిస్తున్నారు. ఇది ఆ వస్తువులను ‘కొనుగోలు’ చేసినట్టుగా భావిస్తారు. ఇలా చేస్తే ఇరు కుటుంబాల మధ్య మనస్పర్థలు లేకుండా, శాంతి, ఐక్యత నెలకొంటుందని విశ్వాసం ఉంది.
