Devotees Donate Silver Gifts Worth Rs. 5 Lakh to Vemulawada Rajanna Temple

వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు విలువైన వెండి కానుకలను సమర్పించారు. వరంగల్‌కు చెందిన తనుగుల రత్నాకర్, అన్నపూర్ణ దంపతులు స్వామివారిపై భక్తితో సుమారు రూ.5 లక్షల విలువైన వెండి వస్తువులను కానుకగా అందజేశారు.

దాదాపు 2 కిలోల బరువున్న వెండి గంప, బిందె, ప్లేట్‌ను ప్రత్యేకంగా తయారు చేయించి ఆలయానికి సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో దేవస్థానం ఈవో రమాదేవికి దంపతులు ఈ కానుకలను అందించారు. వీటి విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటుందని ఆలయ అధికారులు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ ఈవో ప్రతాప నవీన్ కుమార్‌తో పాటు పలువురు ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *