D Spiritual: Oct 2: 11వ రోజు నవరాత్రి ఉత్సవాలు: ఇంద్రకీలాద్రి లో మహిషాసుర మర్దిని దుర్గమ్మ దర్శనం

📅 02-10-2025,గురువారం📍ఇంద్రకీలాద్రి: ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ఆఖరి రోజుకి చేరుకున్నాయి. నేడు అమ్మవారు ఆకుపచ్చ రంగు చీరలో ఈ అవతార౦లో అమ్మ ఒక చేతిలో చెరకుగడ, ఇంకో చేతిలో అభయముద్రతో భక్తులను అనుగ్రహిస్తూ దర్శన౦ ఇస్తు౦ది. చెరకు రసం అత్మజ్ఞానాన్ని సూచిస్తుంది. దుష్టులను, దురహ౦కారులను, శిక్షి౦చుటకు అ౦కుశ౦, పాశ౦ ధరి౦చి ఉ౦టు౦ది. ఆమె ప్రశా౦తమైన చిరునవ్వు, చల్లని చూపు భక్తులను అనుగ్రహిస్తాయి. పది రోజుల పాటు అమ్మవారు రోజుకో అవతారంలో రాక్షసులను సంహరించి లోకానికి శాంతి సౌభాగ్యాలు ప్రసాదించినందుకు గుర్తుగా విజయదశమిని జరుపుకుంటాం. రాజరాజేశ్వరీదేవి భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది. ‘అపరాజితాదేవి’గా భక్తులు ఆరాధిస్తారు. పరమేశ్వరుడి అంకం ఆసనంగా.. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను భక్తులకు అనుగ్రహిస్తుందీ తల్లి. యోగమూర్తిగా.. మాయామోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి ఈ తల్లి అధిష్టాన దేవత.

దేవి నవరాత్రుల్లో భాగంగా చివరి రోజు విజయదశమి పర్వదినం నాడు శ్రీ కనకదుర్గా దేవీ సాక్షాత్తూ సిద్ధిధాత్రి శాక్తేయానుసారముగా శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమివ్వనుంది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పర్వదినం రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తారు.

శ్రీ రాజరాజేశ్వరి దేవి విశిష్టత

సకల భువన బ్రహ్మాండాలకు శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆరాధ్య దేవత. కావున మహా త్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాత్రయంలో పూజలందుకుంటూ అపరాజితాదేవిగా విరాజిల్లుతుంది. ఈ రోజు అమ్మవారు బంగారం రంగు చీర ధరించి చతుర్భుజాలతో, ఒక చేతిలో చెరకుగడ, ఇంకో చేతిలో అభయముద్రలతో దురహంకారులను, శిక్షించుటకు అంకుశం, పాశం ధరించి భక్తులను అనుగ్రహిస్తుంది.

శ్లోకం

ఈ రోజు అమ్మవారిని
“అంబారౌద్రిణి భద్రకాళి బగళా
జ్వాలాముఖీవైష్ణవీ బ్రహ్మాణీత్రిపురాంతకీ
సురనుతాదేదీప్యమానోజ్జ్వలాచాముండాశ్రిత
రక్షపోషజననీ దాక్షాయణీ పల్లవి చిద్రూపి
పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ” అని స్తుతించాలి.

ఏ రంగు వస్త్రం? ఏ పూలు?

ఈ రోజు అమ్మవారికి ఎరుపు, ఆకుపచ్చ రంగు వస్త్రాలను సమర్పిస్తారు. చేమంతులు, గులాబీలతో అమ్మవారిని అర్చించాలి. రాజరాజేశ్వరి దేవికి చింతపండు పులిహోర, రవ్వ కేసరి, పరమాన్నం, లడ్డూలు నైవేద్యంగా సమర్పించాలి. శ్రీ రాజరాజేశ్వరి దేవి అనుగ్రహం భక్తులందరిపై ఉండుగాక! శ్రీమాత్రేనమః

నైవేద్యాలు & ప్రసాదాలు

11వ రోజు రాజరాజేశ్వరి దేవికి ప్రత్యేకంగా సమర్పించే నైవేద్యాలు:

  • పాలు, పెరుగు, పాయసం
  • ఫలాహారం: అరటిపండ్లు, ఆపిల్, ద్రాక్షలు
  • పులిహోర, పెరుగు అన్నం
  • మిఠాయిలు మరియు నువ్వుల లడ్డూలు

ఈ నైవేద్యాలు భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేయబడతాయి.

భక్తుల స్పందన

భక్తులు ఇంద్రకీలాద్రి ఆలయానికి పెద్ద ఎత్తున తరలి వచ్చి, రాజరాజేశ్వరి దేవిగా దుర్గమ్మ దర్శనం పొందుతారు. శాంతి, ఐశ్వర్యం, మరియు కుటుంబ సుఖసంతోషాలు కలుగుతాయని విశ్వసిస్తూ భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana