DSports 18Mar 2026:అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి, వరుసగా రెండోసారి (బ్యాక్-టు-బ్యాక్) టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న టీమిండియాను పాంటింగ్ ఆకాశానికెత్తేశారు. ఐసీసీ రివ్యూలో మాట్లాడుతూ ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

  • అత్యంత బలమైన జట్టు: ప్రస్తుత భారత జట్టు కేవలం టీ20ల్లోనే కాదు, వైట్ బాల్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత బలమైన జట్లలో ఒకటిగా నిలుస్తుందని పాంటింగ్ అభిప్రాయపడ్డారు. గత ఐదేళ్లుగా ఐసీసీ ఈవెంట్లలో భారత్ రికార్డు అద్భుతంగా ఉందని పేర్కొన్నారు.
  • టీమిండియా ఆటగాళ్లు అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు ఐపీఎల్ వంటి హై-ప్రెజర్ టోర్నీల్లో నిరంతరం ఆడటం వల్ల పెద్ద టోర్నీల్లో ఒత్తిడిని సులువుగా అధిగమిస్తున్నారని విశ్లేషించారు. సూపర్-8లో దక్షిణాఫ్రికాతో ఎదురైన ఓటమి తర్వాత జట్టులో చేసిన మార్పులను పాంటింగ్ మెచ్చుకున్నారు. ముఖ్యంగా సంజు శాంసన్‌ను ఓపెనర్‌గా పంపడం, ఇషాన్ కిషన్‌ను మూడో స్థానంలో ఆడించడం టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకున్న గొప్ప నిర్ణయమని కొనియాడారు. టోర్నీ ఆద్యంతం భారత్ చూపిన ప్రతిభ, ముఖ్యంగా నాకౌట్ దశలో వరుసగా 250కి పైగా పరుగులు సాధించడం వారి బ్యాటింగ్ సత్తాకు నిదర్శనమని చెప్పారు.
  • భారత్ వరుసగా 2024 టీ20 ప్రపంచకప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, మరియు ఇప్పుడు 2026 టీ20 ప్రపంచకప్‌తో ఐసీసీ ట్రోఫీల హ్యాట్రిక్ సాధించడంపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. రికీ పాంటింగ్ వంటి దిగ్గజం భారత్‌ను “స్ట్రాంగెస్ట్ ఎవర్ టీమ్” అని పిలవడం విశేషం.\

By Deepak

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana