D Spiritual: Oct 15 ఇంటి ముఖద్వారం ప్రాముఖ్యత
ఇంటికి రాగానే ముందుగా కనిపించేది ముఖద్వారం. గుమ్మం ఇంటికి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. ముఖద్వారం అందంగా, శుభ్రంగా ఉంటే ఇల్లు మరింత శోభాయమానంగా కనిపిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ముఖద్వారం దిశ, నాణ్యత ఇంట్లో నివసించే వారి జీవితం మీద ప్రభావం చూపుతుంది. కొత్త సంవత్సరం సమీపిస్తున్న ఈ సమయంలో, కొన్ని వాస్తు నియమాలు జీవితంలో ఆనందం, సౌభాగ్యం, సుఖశాంతిని తీసుకువస్తాయని పండితులు చెబుతున్నారు.

ముఖద్వారం దిశ మరియు నిర్మాణం
ఇంటి ప్రధాన ద్వారం ఏ దిశలో ఉందో, ఎలా నిలిపారో చాలా ముఖ్యం. ప్రహరీ గేటు దాటి నేరుగా ఇంట్లోకి ప్రవేశించలేని పరిస్థితిలో, ప్రహరీలోపలికి వచ్చిన తర్వాత కుడివైపు తిరిగి ముఖద్వారం ద్వారా ఇంట్లోకి రావడం వాస్తు శ్రేయస్కరం. దీనికి విరుద్ధంగా ఉంటే వాస్తు దోషం ఏర్పడుతుంది. అలాగే, ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కొన్ని పవిత్ర వస్తువులు ఉంచడం వల్ల ఇంటి వైబ్రేషన్ పాజిటివ్‌గా మారుతుంది.

తులసి మొక్క
తులసి మొక్క ఇంట్లో ఆనందం, శాంతి, సౌభాగ్యాన్ని తెస్తుంది. తులసి మొక్క నాటే ముందు ఆ ప్రదేశం శుభ్రంగా ఉండాలి. ఈ మొక్క ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. తులసి ఉన్న ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. తులసి గాలి శుద్ధి చేస్తుంది, హానికారక కెమికల్స్‌ను శోషిస్తుంది. ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ రాకుండా నిరోధిస్తుంది. తులసి వల్ల కుటుంబ ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఆర్థిక స్థితి బలపడుతుంది. కాబట్టి ప్రతి ఇంటిలో తులసి మొక్క ఉండాలి.

కలశం ప్రాముఖ్యత
ఇంటి ప్రధాన ద్వారం వద్ద నీటితో నిండిన కలశం ఉంచడం పవిత్రతకు సంకేతం. రాగి లేదా ఇత్తడి చెంబును పసుపు, కుంకుమలతో అలంకరించి, నీరు నింపి అందులో పసుపు, కుంకుమ, గంధం, పచ్చకర్పూరం, పూలు లేదా మామిడి ఆకులు వేసి ద్వారం పక్కన ఉంచాలి. పురాణాల ప్రకారం కలశంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల శక్తి వుంటుందని చెబుతారు. అందుకే పూజల్లో ముందుగా కలశ స్థాపన చేస్తారు.

స్వస్తిక గుర్తు
ఇంటి ముఖద్వారం వద్ద స్వస్తిక గుర్తు ఉండడం చాలా శుభప్రదం. అది లేకపోతే కనీసం ముగ్గులో స్వస్తికను వేసి పెట్టాలి. స్వస్తిక అదృష్టం, ఆరోగ్యం, ఆనందం, సమృద్ధికి సంకేతం. స్వస్తిక చిహ్నం ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానిస్తుంది. కనుక గుమ్మానికి లేదా దాని దగ్గర స్వస్తిక గుర్తు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.

పువ్వులు మరియు పూ మాలలు
సనాతన ధర్మంలో పువ్వులు పూజల్లో ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. పూ మాలలు ప్రేమ, గౌరవం, భక్తి, స్వచ్ఛతకు ప్రతీకలు. దేవతార్చనలో పువ్వుల ప్రాధాన్యం అపారమైనది. ఇంటి గుమ్మం పవిత్రమైన ప్రదేశంగా భావించి పసుపు, కుంకుమలతో అలంకరించడం సంప్రదాయం. అలాగే పచ్చని మామిడాకుల తోరణాలు, తాజా పూ మాలలతో ముఖద్వారాన్ని అలంకరించడం శుభకార్యం. కొత్త సంవత్సరం శుభవేళలో ఇల్లు పూలతో, తోరణాలతో అలంకరించడం శాంతి, సౌభాగ్యాన్ని తెస్తుంది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana