
D Spiritual: Nov 11: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గోర్లు కత్తిరించే నియమాలు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే ఆర్థిక సమస్యలకు, మానసిక సమస్యలకు కారణం అవుతాయని చెబుతారు. అటువంటి వాటిలో గోర్లు కత్తిరించడం కూడా ఒకటి. గోళ్లు ఏ రోజు తీసుకోవాలి అనే దానికి కూడా ప్రత్యేకమైన నియమాలు ఉన్నాయి.
ఆదివారం – దరిద్రాన్ని ఆహ్వానించే రోజు
సాధారణంగా ఆదివారం సెలవు రోజు కావడంతో చాలా మంది ఆ రోజే గోళ్లు తీసేస్తారు. కానీ నిపుణుల ప్రకారం ఆదివారం గోళ్లు కత్తిరించకూడదు. ఆ రోజు గోళ్లు తీస్తే దరిద్రం చుట్టుకుంటుందని, ఆర్థిక కష్టాలు తప్పవని అంటున్నారు.
సోమవారం – శుభవార్తలు అందించే రోజు
గోళ్లు కత్తిరించుకోవడానికి సోమవారం చాలా శుభదాయకం. ఆ రోజు గోళ్లు తీస్తే మంచి వార్తలు వింటారని, పెద్దల నుంచి గుడ్ న్యూస్ వస్తుందని విశ్వసిస్తారు.
మంగళవారం – చిక్కులు, సవాళ్లు వచ్చే రోజు
మంగళవారం ఎట్టి పరిస్థితుల్లో గోళ్లు కత్తిరించకూడదు. ఆ రోజు గోళ్లు తీస్తే జీవితంలో చిక్కులు వస్తాయని, సవాళ్లు పెరుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
బుధవారం – ప్రశాంతతనిచ్చే రోజు
బుధవారం గోళ్లు తీసుకోవడానికి అనుకూలమైన రోజు. ఆ రోజు గోళ్లు తీస్తే మనసుకు ప్రశాంతత కలుగుతుందని, మానసికంగా సాంత్వన పొందుతారని అంటారు.
గురువారం – పూజలకు, శుభసూచనలకు అనుకూలం
గురువారం పుణ్యమైన రోజు. ఆ రోజు కొన్ని మంచి సంకేతాలు వచ్చే అవకాశం ఉండడం వల్ల గోళ్లు కత్తిరించకుండా ఉండటం మంచిదని సూచిస్తున్నారు.
శుక్రవారం – అనారోగ్య సూచనల రోజు
శుక్రవారం గోళ్లు తీయడం అస్సలు మంచిది కాదు. ఆ రోజు గోళ్లు తీస్తే అనారోగ్యాలు రావచ్చని, శత్రువుల పీడలు కూడా కలగవచ్చని చెబుతున్నారు.
శనివారం – దరిద్ర దేవతను ఆహ్వానించే రోజు
శనివారం గోళ్లు కత్తిరించడం చాలా అపశకునంగా భావిస్తారు. ఆ రోజు గోళ్లు తీస్తే దరిద్ర దేవతను స్వయంగా ఆహ్వానించినట్లే అవుతుందని చెబుతారు.
మొత్తం గా
మొత్తం గా చూసుకుంటే, గోళ్లు కత్తిరించడానికి సోమవారం మరియు బుధవారం రోజులు అత్యంత శుభదాయకం. అలాగే గోర్లను కొరకడం కూడా చెడు అలవాటు — అది శారీరక, మానసిక దుష్ప్రభావాలను కలిగించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
