
D News: Aug 7: శిక్షణలో ఉన్న ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణ: ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారంలో పోలీసుల విచారణ వేగం పెరిగింది. సిటీ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ స్వయంగా దాదాపు ఐదు గంటల పాటు ఉదయ్ కృష్ణారెడ్డిని విచారించినట్లు సమాచారం. కేసుకు సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ విచారణ కొనసాగింది.
విచారణలో ఘటన సమయంలో కనిపించకుండా పోయిన ఐఫోన్, దాడికి ఉపయోగించినట్లు అనుమానిస్తున్న కత్తి ఎక్కడ ఉందనే అంశాలపై అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అలాగే ఉన్నతాధికారులు అడిగిన కొన్ని కీలక ప్రశ్నలకు ఉదయ్ కృష్ణారెడ్డి స్పష్టమైన సమాధానాలు ఇవ్వకుండా దాటవేసినట్లు సమాచారం.
అదేవిధంగా ఒక మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారితో ఉన్న వ్యక్తిగత సంబంధాలు, వాటి నేపథ్యంలో తలెత్తిన వివాదాలపై కూడా పోలీసులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.
