
DNews 07May 2026:తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో, గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ పెట్టిన నిబంధన రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. “ముందుగా బలం నిరూపించుకోండి.. ఆ తర్వాతే అవకాశం” అని రాజ్‌భవన్ వర్గాలు స్పష్టం చేశాయి.
- టీవీకే (TVK): 108 స్థానాలు
- కాంగ్రెస్ మద్దతు: 5 స్థానాలు
- మొత్తం: 113 (మెజారిటీకి ఇంకా 5 స్థానాల దూరంలో..)
- విజయ్ తన వద్ద 113 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్‌కు తెలియజేయగా, గవర్నర్ మాత్రం రాజ్యాంగ నిబంధనలను గుర్తు చేస్తూ 118 మంది సభ్యుల మద్దతు లేఖలు సమర్పించాలని కోరారు. సంఖ్యాబలంపై పూర్తి సంతృప్తి కలిగితేనే ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానిస్తామని ఆయన తేల్చి చెప్పారు.
