కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మద్దూర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కాలేజీ ప్రాంగణం, తరగతి గదులు, ల్యాబ్‌లను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులు, కాలేజీలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం కళాశాల అధ్యాపకులు, విద్యార్థులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను త్వరితగతిన అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు.

మద్దూర్ ప్రాంతంలో విద్యా మౌలిక వసతులతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని జిల్లా అధికారులకు సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. విద్యా మౌలిక వసతుల బలోపేతం, మద్దూర్ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

By Rajini