Chiranjeevi’s Vishwambhara vs Kaaka: Director Vassishta’s Devotional Post Sparks Fresh Release Date Buzz

D News: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’, ‘కాకా’ సినిమాల రిలీజ్‌పై మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. ఇప్పటికే ‘కాకా’ను జనవరి 13న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరోవైపు ‘విశ్వంభర’ కూడా సంక్రాంతికి వస్తుందనే వార్తలు ఉన్నప్పటికీ.. ఇప్పటివరకు అధికారిక రిలీజ్ డేట్ ప్రకటించలేదు.

ఈ నేపథ్యంలో ‘విశ్వంభర’ దర్శకుడు వశిష్ఠ చేసిన ఓ డివోషనల్ పోస్ట్ ఆసక్తిని పెంచింది. శివుడికి సంబంధించిన ప్రవచన వీడియోను షేర్ చేస్తూ.. ‘‘శ్వాస నాది, శాసనం నీది.. ఆశ నాది, పాశం నీది.. ఆత్మ నాది, ఆట నీది.. ఎంత మాయగాడివయ్యా! ఇందుకేనా నిన్ను ‘విశ్వంభరుడు’ అని పిలిచేది?’’ అంటూ క్యాప్షన్ పెట్టారు.

దీంతో ఈ పోస్ట్ రిలీజ్ డేట్‌కు ఏదైనా క్లూ ఇస్తుందా అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. అయితే దీనిపై చిత్రబృందం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

వశిష్ఠ తెరకెక్కిస్తున్న ‘విశ్వంభర’లో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందుతున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.

ఇక బాబీ కొల్లి దర్శకత్వంలో ‘కాకా’ తెరకెక్కుతోంది. జనవరి 13న విడుదల కానున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో అనస్వర రాజన్ చిరంజీవి కూతురిగా నటిస్తున్నారు. త్వరలోనే ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది.

By Avinash