
DNews: Dec 27: సికింద్రాబాద్లో నిషేధిత చైనీస్ మంజా మళ్లీ ప్రాణాంతకంగా మారింది. కీసర మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన ఘటనలో, ఇంటర్ విద్యార్థి యశ్వంత్ రెడ్డి తన ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా చెట్ల మధ్య వేలాడుతున్న మంజా అతని మెడకు చిక్కి తీవ్ర గాయాలు కలిగించింది. రక్తస్రావం ఎక్కువగా ఉండటంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స చేసి సుమారు 19 కుట్టులు వేశారు. ప్రస్తుతం అతని పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. నిషేధం ఉన్నప్పటికీ మంజా విక్రయాలు కొనసాగుతున్నందుకు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, విక్రేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

