D Spiritual: Apr 29: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ఉత్తరాంధ్ర ఆరాధ్యక్షేత్రమైన సింహాచలం దేవస్థానంను సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థాన అధికారులు మరియు అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ సంప్రదాయం ప్రకారం భక్తులు విశ్వసించే కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకుని తన మొక్కులు చెల్లించుకున్నారు.

దర్శనం అనంతరం రంగమండపంలో వేద పండితులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాన్ని ఆయనకు బహూకరించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.

ఈ ఆధ్యాత్మిక పర్యటనలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు, గణబాబు తదితరులు పాల్గొన్నారు.

అంతకుముందు విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం ముఖ్యమంత్రి ఈ పర్యటన చేపట్టారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana