
హైదరాబాద్: బీఆర్ఎస్ నాయకుడు, మాజీ కార్పొరేషన్ ఛైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భార్య ఇందుజా రెడ్డి ఇచ్చిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. అయితే తన అరెస్ట్ అక్రమమని బాలరాజు యాదవ్ పేర్కొన్నారు.
ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చేసిన వ్యాఖ్యలపై బాలరాజు యాదవ్ మీడియా సమావేశంలో స్పందించారు. ఈ సందర్భంగా బల్మూరి వెంకట్‌పై విమర్శలు చేశారు. దీనిపై ఇందుజా రెడ్డి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ వ్యవహారంలో తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం దారుణమని బాలరాజు యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. తనను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు.
