
DET:NOV 06:
బిగ్ బాస్ ఇంట్లో రహస్య తిరుగుబాటు: కల్యాణ్ ఎలిమినేషన్!
బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్‌లో ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌లో ఒక పెద్ద ట్విస్ట్ వచ్చింది.ఇంట్లో రహస్య తిరుగుబాటుదారులు ఉన్నారని,వాళ్ళు పోటీదారులను రహస్యంగా ఎలిమినేట్ చేస్తారని బిగ్ బాస్ ప్రకటించడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది.ఈ తిరుగుబాటుదారుల పాత్రను సుమన్ మరియు దివ్య పోషించారు.
రహస్య మిషన్ ప్రారంభం: ఫోన్ కాల్స్ తో గందరగోళం:
ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ మొదలవడానికి సంకేతంగా,ఇంట్లో ఒక టెలిఫోన్ మోగింది.మొదట ఆ ఫోన్ కాల్ అందుకున్న తనుజ చెప్పిన మాటలను చాలామంది,ముఖ్యంగా రితు,నమ్మలేదు.ఇది తనుజకు ఇచ్చిన రహస్య టాస్క్ అయి ఉంటుందని అనుమానించారు.కానీ ఆ తర్వాత బిగ్ బాస్ ఫోన్ కాల్స్ ద్వారానే టాస్క్‌కు సంబంధించిన వివరాలు ఇస్తారని చెప్పడంతో ఇంట్లో అనుమానాలు మొదలయ్యాయి.
సుమన్ మరియు దివ్యల రహస్య ఎత్తుగడ:
బిగ్ బాస్,సుమన్ మరియు దివ్యలను రహస్య తిరుగుబాటుదారులుగా ప్రకటించాడు.కెప్టెన్సీ రేసు నుండి పోటీదారులను రహస్యంగా తొలగించడమే వారి లక్ష్యం.వారి మొదటి మిషన్ ఏంటంటే,ఇంట్లోని నిర్దేశించిన స్థానాలలో ఉన్న ముగ్గురు కంటెస్టెంట్ల స్థానంలో తాము కూర్చోవడం.
కల్యాణ్ పై ప్రభావం:రేసు నుండి ఔట్:
ఈ మిషన్‌లో భాగంగా,దివ్య చాలా చురుకుగా వ్యవహరించి,భరణి,కల్యాణ్,గౌరవ్,మరియు రితు స్థానాల్లోకి వెళ్ళగలిగింది.ఈ చర్య విజయవంతం కావడంతో,సుమన్ మరియు దివ్య ఇద్దరూ కలిసి కల్యాణ్ ను కెప్టెన్సీ పోటీదారుల జాబితా నుండి తొలగించారు.బిగ్ బాస్ టెలిఫోన్ ద్వారా కల్యాణ్‌కు ఈ విషయాన్ని తెలియజేశారు.
