
D News: బిగ్ బాస్ తెలుగు 10లో 12వ రోజు కెప్టెన్సీ టాస్క్ ఉత్కంఠగా సాగింది. పలు దశల్లో జరిగిన పోటీల్లో చివరకు ఝాన్సీ విజయం సాధించి సీజన్ తొలి కెప్టెన్‌గా నిలిచారు. చివరి రౌండ్లో రామ్ ప్రసాద్‌తో పోటీపడిన ఝాన్సీ.. టాస్క్‌ను వేగంగా పూర్తి చేసి కెప్టెన్సీని సొంతం చేసుకున్నారు. దీంతో ఆమెకు బిగ్ బాస్ అభినందనలు తెలపడంతో పాటు ప్రత్యేక కెప్టెన్ గది కూడా కేటాయించారు.
కెప్టెన్సీ పోటీదారులుగా ముఖేష్, షాలిని, ఝాన్సీ, త్రిగుణ్, రామ్ ప్రసాద్ నిలిచారు. టాస్క్‌లో భాగంగా వీరంతా జైలులో ఉండగా.. మిగతా హౌస్మేట్స్ గార్డులుగా వ్యవహరించారు. జైలు గేట్లు తెరిచిన వెంటనే కంటెండర్లు బయటకు వచ్చి గోడ దూకి సేఫ్ జోన్‌కు చేరుకోవాలి. అయితే తమకు కెప్టెన్‌గా నచ్చని కంటెండర్‌ను గార్డులు అడ్డుకునే అవకాశం ఇచ్చారు.
షాలిని, వర్షిణి మధ్య మాటల యుద్ధం
టాస్క్‌లో భాగంగా గార్డులు రెండు గ్రూపులుగా విడిపోయారు. వర్షిణి, నరేష్, దేబ్జానీ తదితరులు షాలినిని టార్గెట్ చేయగా.. మరోవైపు రామ్ ప్రసాద్, త్రిగుణ్, ముఖేష్ సేఫ్ జోన్‌కు చేరుకున్నారు. ఝాన్సీని కూడా అడ్డుకునే ప్రయత్నం జరిగినప్పటికీ.. షాలినిని ఆపే క్రమంలో గార్డుల దృష్టి మళ్లడంతో ఆమె సేఫ్ జోన్లోకి వెళ్లగలిగారు.
అయితే షాలినిని అడ్డుకునే సమయంలో వర్షిణి చేసిన వ్యాఖ్యలు ఇద్దరి మధ్య వాగ్వాదానికి దారితీశాయి. రామ్ ప్రసాద్ కెప్టెన్ కావాలనేది తమ కోరిక అని, షాలినికి వయసు, అనుభవం తక్కువగా ఉండటంతోనే ఆమెను అడ్డుకుంటున్నామని వర్షిణి చెప్పింది.
దీనిపై షాలిని తీవ్రంగా స్పందించింది. కెప్టెన్ కావడానికి వయసే ప్రమాణమా? అంటూ ప్రశ్నించింది. తన వయసును టాస్క్‌లోకి తీసుకురావాల్సిన అవసరం ఏముందని నిలదీసింది. వయసు ఎక్కువగా ఉన్నవారే కెప్టెన్ కావాలనే నిబంధన ఏదీ లేదని చెప్పడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది.
రామ్ ప్రసాద్‌ను ఓడించిన ఝాన్సీ
ఆ తర్వాతి రౌండ్లలో ముఖేష్, త్రిగుణ్ టాస్క్ నుంచి నిష్క్రమించడంతో చివరికి రామ్ ప్రసాద్, ఝాన్సీ మాత్రమే మిగిలారు. చివరి టాస్క్‌లో ఫెన్సింగ్‌ను కట్టర్‌తో కట్ చేసి అవతలి వైపు చేరుకుని కెప్టెన్సీ జెండాను ఎగరేయాల్సి ఉంది.
ఈ పోటీలో ఝాన్సీ ముందుగా టాస్క్‌ను పూర్తి చేయడంతో బిగ్ బాస్ తెలుగు 10 తొలి కెప్టెన్‌గా నిలిచారు. కెప్టెన్సీతో పాటు ప్రత్యేక గది కూడా దక్కించుకున్నారు. మొత్తంగా 12వ రోజు ఎపిసోడ్లో ఝాన్సీ కెప్టెన్సీ విజయం, షాలిని–వర్షిణి మధ్య జరిగిన వాగ్వాదం ప్రధానంగా నిలిచాయి.
