Jason Sanjay’s Sigma Trailer Impresses.. Sundeep Kishan Promises a High-Octane Action Entertainer!

D News: తమిళ స్టార్ హీరో విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సిగ్మా’. టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ట్రైలర్‌లో కనిపించిన యాక్షన్, క్రైమ్ ఎలిమెంట్స్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.

ట్రైలర్‌ను బట్టి చూస్తే గ్యాంబ్లింగ్, డ్రగ్స్, మనీ హైస్ట్, అండర్‌వరల్డ్ నేపథ్యంలో కథ సాగనున్నట్లు తెలుస్తోంది. సందీప్ కిషన్ ఇందులో డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తున్నారు. ఒకవైపు రేడియో జాకీగా కనిపిస్తూనే.. మరోవైపు అండర్‌వరల్డ్ డాన్ సంపత్ రాజ్‌కు సంబంధించిన క్రైమ్ సామ్రాజ్యాన్ని ఢీకొట్టే మిషన్‌లో భాగమైన వ్యక్తిగా కనిపిస్తున్నారు.

ట్రైలర్‌లోని యాక్షన్ సీక్వెన్స్‌లు, స్టైలిష్ విజువల్స్‌తో పాటు ఎస్. థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా సందీప్ కిషన్ పాత్రకు సంబంధించిన యాక్షన్ షాట్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

భారీ తారాగణంతో ‘సిగ్మా’

సందీప్ కిషన్‌కు జోడీగా ఫరియా అబ్దుల్లా నటిస్తున్నారు. సంపత్ రాజ్, శివ్ పండిట్, ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు రాజు సుందరం తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.

జేసన్ సంజయ్ తొలిసారి దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ‘సిగ్మా’పై కోలీవుడ్‌తో పాటు తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ సినిమాను 2026 అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ట్రైలర్ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలోనూ ‘సిగ్మా’పై చర్చ మొదలైంది. మరి జేసన్ సంజయ్ దర్శకుడిగా ఎలాంటి మార్క్ చూపిస్తారో, సందీప్ కిషన్ ఈ యాక్షన్ రోల్‌తో ఎంతవరకు మెప్పిస్తారో తెలియాలంటే అక్టోబర్ 2 వరకు వేచి చూడాల్సిందే.

By Avinash