
భారతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) కీలక ఆఫర్ను ప్రకటించింది. భారత పాస్పోర్ట్ కలిగిన ప్రయాణికులకు ఉచిత వీసా సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
యూఏఈ పర్యాటక శాఖ గుర్తింపు పొందిన సంస్థల ద్వారా విమాన టికెట్లు బుక్ చేసుకుని, అబుదాబీలోని హోటళ్లలో వరుసగా కనీసం మూడు రాత్రులు బస చేసే భారతీయులకు ఈ ఉచిత వీసా సదుపాయం వర్తిస్తుంది. అయితే ఈ ప్రత్యేక ఆఫర్ అక్టోబర్ 31వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని అధికారులు వెల్లడించారు. భారతీయ పర్యాటకులను మరింతగా ఆకర్షించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
భారత్ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కు వెళ్లే పర్యాటకులకు ఆ దేశ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. భారతీయ ప్రయాణికులను మరింతగా ఆకర్షించడంతో పాటు పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఉచిత వీసా సదుపాయాన్ని ప్రకటించింది.
ఈ ప్రత్యేక ఆఫర్ ద్వారా అర్హత కలిగిన భారతీయ పర్యాటకులు వీసా రుసుము చెల్లించకుండానే యూఏఈలో పర్యటించే అవకాశం పొందనున్నారు. భారతీయ పర్యాటకులకు ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఉచిత వీసా పొందేందుకు నిబంధనలు ఇవే..!
ఈ ఉచిత వీసా సదుపాయాన్ని పొందేందుకు యూఏఈ పర్యాటక శాఖ కొన్ని నిబంధనలను విధించింది. పర్యాటక శాఖ అధికారికంగా గుర్తింపు పొందిన ట్రావెల్ భాగస్వాములు లేదా ఆమోదిత ఆన్లైన్ రవాణా సంస్థల ద్వారా ప్రయాణ టికెట్లు బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
అలాగే యూఏఈ పర్యటనలో భాగంగా అబుదాబీలోని హోటళ్లలో వరుసగా కనీసం మూడు రాత్రులు బస చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను పూర్తి చేసిన భారతీయ ప్రయాణికులు మాత్రమే ఉచిత వీసా సదుపాయాన్ని పొందేందుకు అర్హులు.
