D Spiritual: Jan 28: భీష్మ ఏకాదశి ప్రాధాన్యత

మాఘ మాస శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశిగా పిలుస్తారు. 2026 జనవరి 29 గురువారం భీష్మ ఏకాదశి వచ్చింది. మాఘ శుక్ల అష్టమి రోజున భీష్ముడు శరీరాన్ని విడిచాడు. అయితే భీష్ముడి కోసం స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక ప్రత్యేక ఏకాదశిని కేటాయించాడని పురాణాలు చెబుతాయి. అదే భీష్మ ఏకాదశి. కృష్ణుడే కేటాయించిన ఈ పవిత్ర తిథి కావడంతో దీనికి విశేష మహత్తు ఉంది.

విష్ణు సహస్రనామ స్తోత్ర మహిమ

ఈ రోజున విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదివినా లేదా విన్నా కోట్ల జన్మల పాపాలు తొలగిపోతాయని విశ్వాసం. అనేక జన్మల శాపాల నుంచి విముక్తి లభిస్తుంది. కర్మ ఫలితాల తీవ్రత తగ్గి, విష్ణుమూర్తి అనుగ్రహంతో అదృష్టం, ఐశ్వర్యం సిద్ధిస్తాయని పండితులు చెబుతారు.

సమయం లేనివారికి రెండు మంత్రాలు

విష్ణు సహస్రనామం చదవలేని వారు లేదా వినడానికి వీలు కానివారు ఆ రోజు రెండు మంత్రాలను మనసులో జపించవచ్చు. అవి — అష్టాక్షరి మంత్రం “ఓం నమో నారాయణాయ”, ద్వాదశాక్షర మంత్రం “ఓం నమో భగవతే వాసుదేవాయ”. వీలైనప్పుడల్లా ఈ రెండు మంత్రాలను జపిస్తే ఏడాది పొడవునా విష్ణుమూర్తి అనుగ్రహంతో శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతారు.

శ్రీకృష్ణ పూజ విధానం

భీష్మ ఏకాదశి రోజున పూజామందిరంలో శ్రీకృష్ణుడి చిత్రపటాన్ని ఉంచి, ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. 5 లేదా 6 వత్తులతో దీపం వెలిగించవచ్చు. శ్రీకృష్ణుడికి తులసి దళాలు, నీలం రంగు పూలు ఎంతో ప్రీతికరం. వీటితో పూజ చేస్తూ కృష్ణుడి 108 నామాలు చదవడం శుభప్రదం.

108 నామాలు చదవలేని వారికి

108 నామాలు చదవలేని వారు ద్వాదశాక్షర మంత్రం “ఓం నమో భగవతే వాసుదేవాయ” ను కనీసం 21 సార్లు జపించాలి. నీలం పూలు, తులసి దళాలతో కృష్ణుడిని పూజిస్తూ ఈ మంత్రం జపిస్తే కృష్ణుడి అనుగ్రహం లభిస్తుంది. పాలు, పెరుగు, వెన్న లేదా పటిక బెల్లం నైవేద్యంగా సమర్పించవచ్చు.

ఆర్థిక సమస్యలకు పరిష్కారం

ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారు పాలలో అటుకులు కలిపి కృష్ణుడికి నైవేద్యం పెట్టి, తరువాత ప్రసాదంగా తీసుకోవాలి. ఇలా చేస్తే కృష్ణుడి అనుగ్రహంతో ధన సంబంధ సమస్యలు తొలగిపోతాయని పండితులు సూచిస్తున్నారు.

కుటుంబ శాంతికి ప్రత్యేక ఉపాయం

కుటుంబ కలహాలు ఎక్కువగా ఉన్న వారు కృష్ణుడి పూజలో నెమలి పించాలను ఉంచాలి. పూజ అనంతరం వాటిని ఇంట్లో బీరువాలో దాచిపెట్టాలి. ఇంట్లో పూజ చేయడంతో పాటు దేవాలయంలో కృష్ణుడిని దర్శించుకుంటే మరింత మంచి ఫలితాలు కలుగుతాయి. కృష్ణాలయంలో ధ్వజస్తంభం వద్ద దీపం పెట్టడం, సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయడం కూడా శుభకరం.

ఉపవాస విధానం

భీష్మ ఏకాదశి రోజున అన్నం తినకుండా ఉపవాసం ఉండటం మంచిది. పాలు, పండ్లు మాత్రమే తీసుకోవాలి. రాత్రికీ పాలు, పండ్లే తీసుకుని, మరునాడు స్నానం చేసి కృష్ణుడిని పూజించిన తరువాత భోజనం చేయాలి. పూర్తి ఉపవాసం చేయలేని వారు ఉదయం పాలు–పండ్లు తీసుకుని, రాత్రి గోధుమ రవ్వతో చేసిన ఉప్మా తీసుకోవచ్చు. దీనిని హరి నక్తం అంటారు. ఇలా చేసినా ఏకాదశి ఉపవాస ఫలం లభిస్తుంది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana