
DSports 05Feb 2026:ఢాకా: టీ-20 వరల్డ్ కప్లో భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన ప్రకటనపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆందోళన వ్యక్తం చేసింది. పాక్ తమకు సంఘీభావం తెలపడం ఒకెత్తయితే, ఈ నిర్ణయం వల్ల క్రికెట్ ప్రపంచానికి, ముఖ్యంగా తమకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లుతుందని బంగ్లాదేశ్ బోర్డు అధికారులు అభిప్రాయపడ్డారు.
- ఆర్థిక నష్టం: “భారత్-పాక్ మ్యాచ్ జరగకపోతే ఐసీసీకి వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గుతుంది. ఐసీసీ రెవెన్యూ పూల్ నుండి మాకు అందే వాటా (Dividend) కూడా తగ్గిపోతుంది. ఇప్పటికే టోర్నీ నుంచి తప్పుకోవడం వల్ల మేము నష్టపోయాము, ఇప్పుడు పాక్ నిర్ణయం వల్ల అది మరింత పెరుగుతుంది” అని ఓ సీనియర్ బీసీబీ డైరెక్టర్ పేర్కొన్నారు.
- ఆధిపత్యానికి సవాల్: పాక్ నిర్ణయాన్ని సమర్థిస్తూనే.. “బీసీసీఐ ఆధిపత్యాన్ని ప్రశ్నించాలని పాకిస్థాన్ భావిస్తోంది. ఆ కోణంలో చూస్తే వారి నిర్ణయం సరైనదే కావచ్చు. మా వాదన వినకుండానే మమ్మల్ని టోర్నీ నుంచి తొలగించినందుకు ఇలాంటి స్పందనలు రావడం సహజమే” అని అధికారులు వ్యాఖ్యానించారు.
- థ్యాంక్యూ పాకిస్థాన్: మరోవైపు, బంగ్లాదేశ్ స్పోర్ట్స్ అడ్వైజర్ ఆసిఫ్ నజ్రుల్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. తమకు మద్దతుగా నిలిచినందుకు “థ్యాంక్యూ పాకిస్థాన్” అంటూ పోస్ట్ చేయడం గమనార్హం.
