DSports 29 Nov:లక్నో: ముంబై యువ ఓపెనర్ ఆయుష్ మాత్రే (Ayush Mhatre) సంచలనం సృష్టించాడు. కేవలం 18 ఏళ్ల వయసులోనే దేశవాళీ క్రికెట్‌లో ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ పేరిట 19 ఏళ్లుగా ఉన్న ఒక వరల్డ్ రికార్డును బద్దలు కొట్టాడు.

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-26లో భాగంగా శుక్రవారం విదర్భతో జరిగిన మ్యాచ్‌లో ఆయుష్ మాత్రే విధ్వంసకర శతకంతో చెలరేగి ముంబైకి విజయాన్ని అందించాడు.శుక్రవారం లక్నోలోని ఎకానా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో విదర్భ నిర్దేశించిన 193 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై జట్టు ఛేదించింది.ఆయుష్ మాత్రే ప్రదర్శన ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఆయుష్ కేవలం 53 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్ల సహాయంతో నాటౌట్‌గా 110 పరుగులు చేశాడు.ఈ విధ్వంసక ఇన్నింగ్స్‌తో ముంబై జట్టు 17.5 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరపున కూడా ఆడుతున్న ఈ యువ బ్యాటర్, తన అద్భుతమైన ప్రదర్శనతో టీమిండియా భవిష్యత్తు స్టార్‌గా తన పేరును బలంగా వినిపించుకున్నాడు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana