DET:DEC 10:
అవెంజర్స్ డూమ్స్‌డే టీజర్ గురించిన తాజా బజ్:
హాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా Avengers Doomsday గురించే చర్చ.2026లో విడుదల కానున్న ఈ భారీ మార్వెల్ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ముఖ్యంగా ఇందులో రాబర్ట్ డౌనీ జూనియర్ మళ్ళీ MCU మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లోకి ఈసారి విలన్‌గా,డాక్టర్ డూమ్ పాత్రలో తిరిగి వస్తున్నారనే వార్త పెద్ద సంచలనం సృష్టిస్తోంది.ఈ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ సినిమా ఫస్ట్ టీజర్ ట్రైలర్ గురించి కొన్ని కీలక వివరాలు బయటకు వచ్చాయి.

టీజర్ రన్‌టైమ్ రేటింగ్ వివరాలు:
సౌత్ కొరియాలోని మీడియా రేటింగ్ బోర్డు జాబితా ప్రకారం Avengers: Doomsday టీజర్ ట్రైలర్ రన్‌టైమ్ 1 నిమిషం 25 సెకన్లుగా ఉంది.ఇది ఒక టీజర్ మాత్రమే అయినప్పటికీ ఇటీవల విడుదలైన చాలా డిస్నీ ఫస్ట్ లుక్ వీడియోల కంటే అవి దాదాపు 50 సెకన్ల లోపే ఉండేవి ఇది కాస్తా ఎక్కువ నిడివిని కలిగి ఉండడం విశేషం.ఈ టీజర్‌కు UA రేటింగ్ లభించింది.అంటే టీజర్ అందరూ చూడదగిన కంటెంట్‌తోనే ఉంటుందని తెలుస్తోంది.

అవతార్ ఫైర్ అండ్ యాష్ తో అరంగేట్రం:
ఈ టీజర్ ఎప్పుడు విడుదలవుతుందనే విషయం గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో భారీగా ఊహాగానాలు నడుస్తున్నాయి.జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన Avatar Fire and Ash సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 19న విడుదల కానుంది.ఈ పెద్ద సినిమాతో కలిపి Avengers: Doomsday టీజర్‌ను థియేటర్లలో ప్రదర్శించడానికి మార్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.అందుకే అడ్వాన్స్‌డ్ ఐమ్యాక్స్ మరియు డాల్బీ వంటి ఫార్మాట్లలో ఈ క్లిప్‌ను భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు.అయితే థియేటర్లలోకి రాకముందే అంటే డిసెంబర్ 18నే ఆన్‌లైన్‌లో టీజర్ విడుదలయ్యే అవకాశం ఉందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.