
DSports 28Jan 2026:మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 క్వార్టర్ ఫైనల్స్‌లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్, అమెరికా స్టార్ కొకొ గాఫ్ అనూహ్య ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించగా, పురుషుల విభాగంలో వరల్డ్ నంబర్ 1 కార్లోస్ అల్కరాజ్ సెమీస్ గండాన్ని దాటి సరికొత్త చరిత్ర సృష్టించాడు.
- అమెరికా ఆశల ఆశాకిరణం కొకొ గాఫ్ క్వార్టర్ ఫైనల్స్‌లో చతికిలపడింది. ఉక్రెయిన్ క్రీడాకారిణి, 12వ సీడ్ ఎలినా స్విటోలినా అద్భుత ప్రదర్శనతో గాఫ్‌ను 6-1, 6-2తో వరుస సెట్లలో ఓడించింది. ఈ ఓటమితో గాఫ్ తీవ్ర అసహనానికి లోనై, మ్యాచ్ అనంతరం రాకెట్‌ను నేలకేసి కొట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
- స్పెయిన్ సంచలనం కార్లోస్ అల్కరాజ్ మెల్బోర్న్ పార్క్‌లో తన క్వార్టర్ ఫైనల్ రికార్డును తిరగరాశాడు. హోమ్ ఫేవరెట్ అలెక్స్ డి మినార్‌పై 7-5, 6-2, 6-1 తేడాతో ఘనవిజయం సాధించి, తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీ ఫైనల్‌లోకి దూసుకెళ్లాడు. సెమీస్‌లో అల్కరాజ్, జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో తలపడనున్నాడు.
- డిఫెండింగ్ ఛాంపియన్ అరియానా సబలెంక తన జోరును కొనసాగిస్తోంది. అమెరికా టీనేజర్ ఐవా జోవిక్‌ను 6-3, 6-0తో చిత్తు చేసి వరుసగా నాలుగోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్‌లోకి ప్రవేశించింది. ఇప్పటివరకు ఈ టోర్నీలో సబలెంక ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. సెమీస్‌లో ఆమె గాఫ్‌ను ఓడించిన స్విటోలినాతో తలపడనుంది.
