
DSports 27Jan 2026:గౌహతి: భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసానికి న్యూజిలాండ్ బౌలర్లు బెంబేలెత్తిపోతున్నారు. ప్రస్తుత టీ20 సిరీస్‌లో అభిషేక్ ఆడుతున్న తీరుపై కివీస్ బౌలింగ్ కోచ్ జాకబ్ ఓరమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అభిషేక్ బ్యాటింగ్‌లో ఎలాంటి లోపాలు వెతకాలో తమకు అర్థం కావడం లేదని ఆయన బాహాటంగానే అంగీకరించారు.
- సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లో అభిషేక్ శర్మ అసాధారణ ఫామ్‌లో ఉన్నాడు. ముఖ్యంగా మూడో టీ20లో కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది న్యూజిలాండ్ బౌలర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు.
- “అభిషేక్ శర్మను ఔట్ చేయడం ఎందుకు కష్టమంటే.. అతని ఆటలో బలహీనతను గుర్తించడం దాదాపు అసాధ్యంగా మారింది. అతని స్ట్రైక్ రేట్ చూస్తుంటే ఏ బౌలర్‌కైనా గుండెల్లో వణుకు పుడుతుంది. ప్లాన్ చేయడం ఒకెత్తయితే, మైదానంలో దాన్ని అమలు చేయడం మరో ఎత్తు” అని ఓరమ్ పేర్కొన్నారు.
- బంతిని మైదానం నలుమూలలకూ బాదుతుంటే బౌలర్లు నియంత్రణ కోల్పోతున్నారని, ఆ సమయంలో ప్రశాంతంగా ఉండి బౌలింగ్ చేయడం చాలా కష్టమని ఆయన వివరించారు.
- మూడో మ్యాచ్ ముగిసిన తర్వాత కివీస్ ఆటగాళ్లు డెవాన్ కాన్వే, జాకోబ్ డఫ్ఫీ ఫన్నీగా అభిషేక్ శర్మ బ్యాట్‌ను తనిఖీ చేశారు. “బ్యాట్‌లో ఏమైనా పెట్టావా? అంత వేగంగా ఎలా కొడుతున్నావు?” అని వారు అడిగినట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్ అయ్యాయి.
